...
...
Next Story

Datta Jayanti 2025: ఈరోజే దత్త జయంతి.. దత్తాత్రేయుని జననంతో పాటు ఏం చెయ్యాలో తెలుసుకోండి!

Datta Jayanti 2025: ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఇక ఈరోజు దత్తాత్రేయుని జననం గురించి, దత్తాత్రేయుని జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దత్త జయంతి నాడు ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది.

Published on: Dec 4, 2025, 07:00:10 IST
Advertisement

పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణిమ, శ్రావణ పౌర్ణమికి ఎలా విశిష్టత ఉన్నాయో అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు దత్త జయంతి. అందరికీ గురు దత్తునిగా, దత్తాత్రేయ స్వామిగా తెలిసిన దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది.

Datta Jayanti 2025: ఈరోజే దత్త జయంతి (pinterest)
Datta Jayanti 2025: ఈరోజే దత్త జయంతి (pinterest)

ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఇక ఈరోజు దత్తాత్రేయుని జననం గురించి, దత్తాత్రేయుని జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

ఎందుకు దత్తాత్రేయుడిని గురువుగా కొలుస్తారు?

దత్తాత్రేయుడు అత్రి మహర్షికి పుట్టాడు. ఈయనలో ఉన్న జ్ఞానం అపారమైనది. ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అందుకే గురువుగా చాలా మంది భావించి ఆశ్రయించారు. తన భక్తులైనటువంటి యదు, కార్తవీర్యార్జునుడు, ప్రహ్లాదుడు, అల్లర్కుడు వంటి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అందుకే గురు దత్తుడిగా చెబుతారు.

దత్తాత్రేయుని జననం

ఈయన అవతారం చాలా మనోహరంగా అనిపిస్తుంది. నారదుడు అడిగితే బ్రహ్మ ఆయన జననం గురించి చెప్పారు. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చిన నారాయణుడే స్వయంగా అతనికి కొడుకుగా అవతరించాడు. ఇలా స్వయంగా వాసుదేవుడే దత్తాత్రేయుడిగా మారాడు. ఇది దత్తాత్రేయుని జననం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు అంశలతో పుట్టాడు. కనుక మూడు తలల బాలుడుగా, మూడు తలల గురువుగా చూపిస్తారు.

దత్త జయంతి నాడు ఏం చేయాలి?

ఉదయాన్నే నది స్నానం చేయాలి. అలా కుదరకపోతే బావి నీరు తీసుకుని స్నానం చేయొచ్చు.

ఆ తర్వాత షోడశోపచార పూజను చేసి ధ్యానం, జపం వంటివి చేస్తే మంచి జరుగుతుంది.

దత్తాత్రేయుడు యోగమార్గాన్ని అనుసరించాడు. అందుకనే చాలా మంది యోగమార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.

మన ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గురువుల చరిత్రలను దత్త జయంతి నాడు పారాయణం చేస్తారు.

ఈరోజు దత్తక్షేత్రాలను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు కలుగుతాయి.

దత్తాత్రేయుడికి ఇష్టమైనటువంటి గోవులను, శునకాలను పూజిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది.

దత్తాత్రేయుడిని ఈరోజు ఆరాధించడం వలన పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుంది.

దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి ఈరోజు భూమిపైకి వస్తాడని నమ్ముతారు. అందుకని గంగా నది ఒడ్డున దత్త పాదుకలను పెట్టి పూజిస్తారు. ఇలా చేస్తే పూర్వజన్మ దోషం నుంచి విముక్తి కలుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks