...
...
Next Story

ఈరోజు కాలాష్టమి వేళ నరఘోష, ప్రతికూల శక్తి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇలా దీపం వెలిగించండి!

మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి చాలా విశేషమైనది. ఈ ఏడాది నవంబర్ 28 అంటే ఈరోజు వచ్చింది. పైగా ఇదే రోజు శుక్రవారం, శతభిష నక్షత్రం రావడం కూడా విశేషం. దీనిని కాలభైరవ అష్టమి, కాలాష్టమి అని కూడా అంటారు. కాలభైరవ అష్టమి నాడు కాలభైరవ ఆలయానికి వెళ్లి కూష్మాండ దీపాన్ని పెడితే మంచిది.

Published on: Nov 28, 2025 07:00 AM IST
Advertisement

మాసాలు అన్నిట్లో మార్గశిర మాసం చాలా విశిష్టమైనది. “మాసానాం మార్గశీర్షోహం” అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి చాలా విశేషమైనది. ఈ ఏడాది నవంబర్ 28 అంటే ఈరోజు వచ్చింది. పైగా ఇదే రోజు శుక్రవారం, శతభిష నక్షత్రం రావడం కూడా విశేషం. దీనిని కాలభైరవ అష్టమి, కాలాష్టమి అని కూడా అంటారు. కాలభైరవ అష్టమి నాడు మీకు సమీపంలో ఉన్న కాలభైరవ ఆలయం లేదా శివాలయానికి వెళ్లి కూష్మాండ దీపాన్ని పెడితే చాలా మంచిది.

ఈరోజు కాలాష్టమి వేళా కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి?

ఈరోజు కాలాష్టమి వేళా దీపం ఎలా వెలిగించాలి? (pinterest)
ఈరోజు కాలాష్టమి వేళా దీపం ఎలా వెలిగించాలి? (pinterest)

కాలాష్టమి రోజు కూష్మాండ దీపం వెలిగిస్తే ఎంతో చక్కటి ఫలితం ఉంటుంది. అయితే కూష్మాండ దీపం వెలిగించేటప్పుడు ఒక నల్లటి వస్త్రాన్ని కాలభైరవుని ఆలయంలో లేదా శివాలయంలో పరిచి, ఆ తర్వాత దానిపై రాళ్ళ ఉప్పు, నవధాన్యాలు వేసి బూడిద గుమ్మడికాయను మధ్యకు కోసి అందులో నువ్వుల నూనె వేసి, ఒక వత్తి పెట్టి వెలిగించాలి. దాని పై తోక మిరియాలను వేయాలి.

ఇలా చేయడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు. సమస్యలన్నీ తీరి సంతోషంగా ఉండడానికి వీలవుతుంది నరఘోష, ప్రతికూల శక్తి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కాలభైరవాష్టకం చదువుకుంటే కూడా మంచి జరుగుతుంది.

కాలభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్

నారదాది- గిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం

నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనమ్

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

శూలటంక పాశదండ పాణిమాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్

భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహమ్

నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం

కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్యమద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్

మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర మోక్షదం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం

దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం

కాశివాసి లోకపుణ్యపాపశోధకం విభుమ్

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే..

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనమ్

శోకమోహ లోభదైన్యకోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్..

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచర్యస్య

శ్రీ గోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య

శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ

శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్..

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe