Kaala Bhairava Jayanthi: ఈ ఏడాది కాలభైరవ జయంతి ఎప్పుడు? తేదీ, పూజా సమయం, శుభ ముహూర్తం తెలుసుకోండి!

కాలభైరవుని జయంతిని కార్తీక మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. భైరవ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున శివుడు కాల భైరవుడి రూపంలో అవతరించి అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీనిని భైరవ అష్టమి, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. కాలభైరవ దేవాలయాల్లో పూజలు చేస్తారు.

Published on: Nov 10, 2025, 13:30:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి సంవత్సరం, కాలభైరవుని జయంతిని కార్తీక మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. భైరవ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున శివుడు కాల భైరవుడి రూపంలో అవతరించి అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీనిని భైరవ అష్టమి, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున, కాలభైరవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. భైరవ చాలీసా, రాత్రి మేల్కొలుపు నిర్వహిస్తారు.

కాలభైరవ జయంతి ఎప్పుడు? తేదీ, పూజ విధి, శుభ ముహూర్తం
కాలభైరవ జయంతి ఎప్పుడు? తేదీ, పూజ విధి, శుభ ముహూర్తం

కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల భయం, వ్యాధి, అకాల మరణం, వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. కాల భైరవుడిని ఆరాధిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవితంలో విజయాన్ని పొందుతాడు. కాలభైరవుడుని ఆరాధిస్తే రాహువు, కేతువు, శని గ్రహాల లోపాలను శాంతింపజేస్తుంది. ఈ రోజున భక్తులు ఆవ నూనెతో దీపం వెలిగించి, నల్ల ధాన్యాలు మరియు నల్ల నువ్వులను సమర్పిస్తారు.

కాలభైరవ జయంతి 2025 ఎప్పుడు వచ్చింది?

వేద క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసం కృష్ణ అష్టమి తేదీ నవంబర్ 11, 2025న మంగళవారం రాత్రి 11:08 గంటలకు ప్రారంభమై నవంబర్ 12, 2025 బుధవారం రాత్రి 10:58 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది నవంబర్ 12, 2025 బుధవారం నాడు కాలభైరవ జయంతిని జరుపుకోవాలి.

కాలభైరవ జయంతి 2025 శుభ ముహూర్తం

బ్రహ్మ ముహూర్తం- ఉదయం 04:56 నుండి 05:49 వరకు

ఉదయం సంధ్య- ఉదయం 05:22 నుండి 06:41 వరకు

అభిజిత్ ముహూర్తం- లేదు

విజయ ముహూర్తం- 01:53 నుండి 02:36 వరకు

గోధులి ముహూర్తం- సాయంత్రం 05:29 నుండి 05:55 వరకు

సాయంత్రం సంధ్య- 05:29 నుండి 06:48 వరకు

అమృత కాలం- సాయంత్రం 04:58 నుండి 06:35 వరకు

నిషిత ముహూర్తం- రాత్రి 11:39 నుండి 12:32 వరకు

కాలభైరవ జయంతి 2025 పూజా విధానం:

  1. ఆలయం లేదా ఇంటి పూజ గదిలో కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయాలి.
  2. ఆవ నూనెతో దీపారాధన చేయాలి.
  3. భైరవ చాలీసా లేదా "ఓం భైరవాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  4. భైరవుడుకి నల్ల నువ్వులు, మినపప్పు, నూనె, కొబ్బరికాయని సమర్పించండి.
  5. రాత్రిపూట మేల్కొని భైరవ మంత్రాలను పఠించవచ్చు.
  6. ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో భయం, ప్రతికూలత, అడ్డంకులను తొలగిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More