...
...
Next Story

Karthika Pournami Remedies: ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, డబ్బుకు లోటు ఉండదు!

ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీదేవిని సరైన పద్ధతిలో ఆరాధించడం వల్ల సంపదకు లోటు ఉండదు. ఆర్థిక పరంగా ఏ ఇబ్బందులు రావు. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం, లక్ష్మీ పూజకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు.

Published on: Nov 5, 2025, 12:00:09 IST
Advertisement

కార్తీక పౌర్ణమి 2025 పరిహారాలు: ప్రతీ ఏటా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాము. ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నవంబర్ 5 అంటే ఈరోజు వచ్చింది. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున లక్ష్మీదేవిని సరైన పద్ధతిలో ఆరాధించడం వల్ల సంపదకు లోటు ఉండదు.

కార్తీక పౌర్ణమి 2025 పరిహారాలు
కార్తీక పౌర్ణమి 2025 పరిహారాలు

ఆర్థిక పరంగా ఏ ఇబ్బందులు రావు. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం, లక్ష్మీ పూజకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థిక లాభాలకు కూడా దారితీస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తే మంచిది?

కార్తీక పౌర్ణమి రోజును చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున దేవతలు భూమిపై దీపావళి జరుపుకోవడానికి వస్తారని చెబుతారు. ఈ రోజున శివుడు త్రిపురాసురుడుని చంపాడు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకుందాం.

  1. కార్తీక పౌర్ణమి రోజున బియ్యం పిండి, కుంకుమతో ఇంటి వెలుపల నుండి లోపలికి వచ్చే లక్ష్మీ మాత పాదముద్రలను వేయండి. ఇది దేవత రాకను సూచిస్తుంది మరియు ఆమె స్వయంగా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.
  2. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మి ఆరాధనలో పసుపు గవ్వలను సమర్పించండి. ఈ రోజున, తెల్ల గవ్వలకు పసుపు రాసి ప్రార్థనా స్థలంలో పెట్టండి. ఈ పసుపు రంగు గవ్వలను రాత్రంతా పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచండి. మరుసటి రోజు, ఈ గవ్వలను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో ఉంచండి.
  3. సాయంత్రం కార్తీక పౌర్ణమిని పూజించేటప్పుడు లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించాలి. దీనితో, మీరు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు క్రమేపీ తొలగిపోతాయి. తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది.
  4. మీరు మీ ఇంట్లో పేదరికాన్ని తొలగించాలనుకుంటే, కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించండి. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒంటి కన్ను కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఇంట్లో సంతోషం మరియు సంవృద్ధిని పెంచుతుందని నమ్ముతారు. పౌర్ణమి రోజున, ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించండి. ఆ తర్వాత మరుసటి రోజు ఈ కొబ్బరికాయను మీ బీరువాలో ఉంచండి. ఇది ఇంటికి సంవృద్ధిని అందిస్తుంది.
  5. కార్తీక పౌర్ణమి రోజున తులసిని పూజించండి. ఈ రోజున తులసిని పూజించడం చాలా పుణ్యమైనదిగా భావిస్తారు. సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks