Margasira Guruvaram: మార్గశిర మాసం చాలా ప్రత్యేకమైన మాసం. మార్గశిర మాసాన్ని సరిగ్గా వినియోగించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. అందుకే “మాసానాం మార్గశీర్షోహం” అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలను లక్ష్మీవారాలని అంటారు. ఈ గురువారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఆ అమ్మ దయ ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు. పేదరికం నుంచి కూడా బయటపడొచ్చు.

శ్రావణ మాసంలో ఎలా అయితే శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని ఆరాధిస్తాము, మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నవంబర్ 27 అంటే ఈరోజు. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం ఈరోజు.
ఎలా లక్ష్మీదేవిని ఆరాధించాలి?
లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సంవత్సరానికి సరిపడా అష్టైశ్వర్యాలని కూడా పొందడానికి వీలవుతుంది. అయితే మరి ఇంతటి ఉత్తమమైన గురువారం నాడు ఏం చేయాలి? ఎలా లక్ష్మీదేవిని ఆరాధించాలి? ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి మార్గశిర లక్ష్మీవార నాడు ఏం చేయాలి?
- భక్తి, శ్రద్ధలతో మార్గశిర మాసంలో వచ్చే గురువారాల రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ఆ లక్ష్మీదేవి వరాల జల్లు కురిపిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. షాంపూ పెట్టి తలస్నానం చేయకూడదని గుర్తుపెట్టుకోండి.
- స్నానం చేసే నీళ్లలో కొంచెం పసుపు కలుపుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి.
- ఈ గురువారం నాడు గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకుని లక్ష్మీదేవిని ఆరాధించాలి.
- ఈరోజు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మంచిది.
- పూజ చేసుకునే చోట ముగ్గు వేసిన దానిపై ఒక పీఠం వేసి, ఎర్రటి వస్త్రం వేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకుని, లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఆరాధించండి.
- లక్ష్మీదేవికి చాలామంది నగలు వేసి అందంగా అలంకరించుకుంటారు.
- ఆవు నెయ్యితో దీపారాధన చేసి, వినాయకుని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి.
- బియ్యం, పెసరపప్పుతో చేసిన పులగాన్ని మొదటి లక్ష్మీవారినాడు లక్ష్మీదేవికి నివేదించాలి.
- ఈరోజు “శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః” అనే మంత్రాన్ని జపిస్తే మంచిది.
- దీప, ధూప, నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి.
మార్గశిర గురువారం నాడు ఇలా చేస్తే మంచిది
డబ్బు కలిగి, ఆర్థిక సమస్యలను దూరంగా ఉంచుకోవాలంటే తులసిని పూజించండి. ఐశ్వర్యం కలుగుతుంది. తులసి కోటకు పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి, ముగ్గు వేసి, నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి. లక్ష్మివారం నాడు గోవును ఆరాధిస్తే కూడా మంచిదే. గోవును ఆరాధించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది.
{{/usCountry}}డబ్బు కలిగి, ఆర్థిక సమస్యలను దూరంగా ఉంచుకోవాలంటే తులసిని పూజించండి. ఐశ్వర్యం కలుగుతుంది. తులసి కోటకు పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి, ముగ్గు వేసి, నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి. లక్ష్మివారం నాడు గోవును ఆరాధిస్తే కూడా మంచిదే. గోవును ఆరాధించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది.
{{/usCountry}}