...
...
Next Story

ఈరోజే శక్తివంతమైన కోరల పౌర్ణమి.. ఇలా చేస్తే అపమృత్యు భయం, నరక బాధలు తొలగిపోతాయి!

హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి దాకా యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. దీంతో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కోరల పౌర్ణమి అంటే యమధర్మరాజుకి ఎంతో ఇష్టం. యమధర్మరాజుని ఆ రోజు పూజిస్తే శాంతి కలుగుతుందని నమ్మకం. కొడుకులు ఉన్నవారు ఇలా దిష్టి తీస్తే మంచిది.

Published on: Dec 4, 2025, 12:00:16 IST
Advertisement

మార్గశిర మాసం చాలా విశిష్టమైనది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని అంటారు. ఈ ఏడాది ఈ కోరల పౌర్ణమి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది.

కోరల పౌర్ణమి 2025

ఈరోజే శక్తివంతమైన కోరల పౌర్ణమి (pinterest)
ఈరోజే శక్తివంతమైన కోరల పౌర్ణమి (pinterest)

హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి దాకా యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. దీంతో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కోరల పౌర్ణమి అంటే యమధర్మరాజుకి ఎంతో ఇష్టం. యమధర్మరాజుని ఆ రోజు పూజిస్తే శాంతి కలుగుతుందని నమ్మకం. అందుకే ఈరోజు యమధర్మరాజుని ఆరాధించాలి.

ఈరోజు కుడుములు చేసి కాలభైరవుడి వాహనం అయినటువంటి కుక్కలకు వేస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇలా చేస్తే కాలభైరవుని అనుగ్రహం ఉంటుందట. అలాగే ఈ కోరల పౌర్ణమి నాడు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి దిష్టి తీస్తారు. ఈ పౌర్ణమిని నరక పౌర్ణమి అని కూడా అంటారు. ఇలా ఈరోజు పిల్లలకు దిష్టి తేయడం వలన వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

కొడుకులు ఉన్నవారు కోరల పౌర్ణమి నాడు ఇలా దిష్టి తీస్తే మంచిది

కొడుకులు ఉన్నవారు మట్టి కుండలో రాళ్ల ఉప్పు, దాని పైన పసుపు, కుంకుమ వేసి ప్రధాన ద్వారం దగ్గర దిష్టి తీయాలి. తరువాత వాటిని పారేయాలి. పౌర్ణమి రోజు రాత్రి చంద్రోదయమైన తర్వాత మాత్రమే ఇలా దిష్టి తీయండి.

కోరలమ్మ

కోరల పౌర్ణమి నాడు కొన్ని ప్రాంతాలలో మినప రొట్టెలు చేస్తారు. అలాగే వాటిని కొరికి కుక్కలకు వేస్తారు. ఇలా చేయడం వలన కాలభైరవ అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాగే మార్గశిర పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధిస్తే కూడా శుభఫలితాలు కలుగుతాయి. చంద్రుని అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చని, చంద్రుడు మానసిక ప్రశాంతతను కలిగిస్తాడని నమ్మకం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks