2026లో పౌర్ణమి ఎప్పుడెప్పుడు వచ్చింది? ఆ రోజు ఏం చెయ్యాలో తెలుసుకోవడంతో పాటు 12 పౌర్ణమిల పూర్తి లిస్ట్ చూసేయండి!
పౌర్ణమి నాడు చేసే పూజ, దానాలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. 2026 కొత్త సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమిలు ఎప్పటిలానే రానున్నాయి. పౌర్ణమి తేదీ చాలా పుణ్యాభివృద్ధి, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక రోజున, పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం పవిత్ర నదులలో స్నానం చేసి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు.
పూర్ణిమ 2026 తేదీ, సమయం: మత విశ్వాసాల ప్రకారం, ప్రతి నెలా వచ్చే పౌర్ణిమ చాలా విశిష్టమైనది. పౌర్ణమి నాడు చేసే పూజ, దానాలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. 2026 కొత్త సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమిలు ఎప్పటిలానే రానున్నాయి. పౌర్ణమి తేదీ చాలా పుణ్యాభివృద్ధి, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

ఈ ప్రత్యేక రోజున, పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం పవిత్ర నదులలో స్నానం చేసి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ధ్యానం చేసి నారాయణను ఆరాధిస్తారు. పౌర్ణమి రోజున స్నానం, దానం మరియు ఉపవాసం శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. 2026 లో పౌర్ణమి ఎప్పుడెప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
2026లో పౌర్ణమి ఎప్పుడెప్పుడు వచ్చింది?
జనవరి 3, 2026 శనివారం - పుష్య శుక్ల పూర్ణిమ వ్రతం
ఫిబ్రవరి 1, 2026, ఆదివారం - మాఘ శుక్ల పూర్ణిమ
మార్చి 3, 2026, మంగళవారం - ఫాల్గుణ, శుక్ల పూర్ణిమ
ఏప్రిల్ 1, 2026, బుధవారం - చైత్ర, శుక్ల పూర్ణిమ
మే 1, 2026, శుక్రవారం - వైశాఖ, శుక్ల పూర్ణిమ
మే 30, 2026, శనివారం- జ్యేష్ఠ, శుక్ల పూర్ణిమ
జూన్ 30 2026, బుధవారం - ఆషాఢ, శుక్ల పూర్ణిమ
ఆగస్టు 27, 2026, గురువారం - శ్రావణ, శుక్ల పూర్ణిమ
28 సెప్టెంబర్ 26, 2026, శనివారం - భాద్రపాద, శుక్ల పూర్ణిమ
అక్టోబర్ 25, 2026, ఆదివారం - ఆశ్వీయుజ, శుక్ల పూర్ణిమ
నవంబర్ 24, 2026, మంగళవారం - కార్తీక, శుక్ల పూర్ణిమ
డిసెంబర్ 23, 2026, బుధవారం- మార్గశిర్ష, శుక్ల పూర్ణిమ
పౌర్ణమి పూజ:
పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. నదీ స్నానం, దీప దానం, పూజలు, వ్రతాలు వంటివి పౌర్ణమి నాడు ఆచరిస్తే ఎంతో పుణ్యం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయి. చంద్రుని దర్శించుకుని చంద్రునికి పూజ చేయడం వలన కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.
వెండి పాత్రలో పాలు, నీళ్లు, పువ్వులు, అక్షతలు వేసి కొంచెం చక్కెర కూడా కలిపి అర్ఘ్యం సమర్పించాలి.
“ఓం సోమాయ నమః” మంత్రాన్ని చంద్రునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు చదువుకోవాలి. 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుంది.
పౌర్ణమి నాడు చంద్రుని ఆరాధించి చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏమైనా దోషాలు ఉంటే కూడా పౌర్ణమి నాడు తొలగిపోతాయి.
పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని, చంద్రుడుని ఆరాధిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. సర్వపాపాలు కూడా తొలగిపోతాయి.
పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడంతో పాటు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే కూడా మంచి జరుగుతుంది. సత్యనారాయణ స్వామి కథ వింటే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు.
భగవద్గీత, రామాయణాన్ని పారాయణం చేస్తే కష్టాలు తొలగి ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. దానాలు చేస్తే కూడా అనుకున్న పనులు జరుగుతాయి, కోరికలు నెరవేరుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


