...
...
Next Story

ఈరోజు సంకటహర చతుర్థి.. శుభ సమయం, పూజా విధానం వివరాలు ఇవిగో!

ఈ రోజు పుష్య శుక్ల చతుర్థి. ప్రతి నెలా చతుర్థి తిథి రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్దలతో గణపతిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదయ తిథి ఉండడంతో ఈరోజు సంకటహర చతుర్థి ఉపవాసం ఉండాలి. ఏ పూజ చేసినా, ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టినా కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని గణపతిని ఆరాధిస్తాము.

Published on: Dec 24, 2025, 09:28:30 IST
Advertisement

సంకటహర చతుర్థి 2025: ఈ రోజు పుష్య మాసం శుక్ల పక్షం విఘ్నేశ్వర చతుర్థి. ప్రతి నెలా చతుర్థి తిథి రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్దలతో గణపతిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదయ తిథి ఉండడంతో ఈరోజు సంకటహర చతుర్థి ఉపవాసం ఉండాలి. ఏ పూజ చేసినా, ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టినా కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని మొట్ట మొదట గణపతిని ఆరాధిస్తాము, గణేశుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

ఈరోజు సంకటహర చతుర్థి.. శుభ సమయం, పూజా విధానం వివరాలు
ఈరోజు సంకటహర చతుర్థి.. శుభ సమయం, పూజా విధానం వివరాలు

చతుర్థి ఉపవాసం కూడా గణేశుడికి అంకితం చేయబడింది. సంకటహర చతుర్థి ఉపవాసాన్ని సరిగ్గా పాటించడం ద్వారా, జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సుకు లోటు ఉండదు. సంకటహర చతుర్థి రోజున శుభ సమయాలు, పద్ధతులు మరియు పూజా మంత్రాలను తెలుసుకుందాం.

సంకటహర చతుర్థి శుభ సమయాలు

శుభ సమయం -ఉదయం 11:19 నుండి మధ్యాహ్నం 01:11 వరకు

వ్యవధి - 01 గంట 52 నిమిషాలు

నిషిద్ధ చంద్రుడిని చూసే సమయం - ఉదయం 10:16 నుండి రాత్రి 09:26 వరకు

వ్యవధి - 11 గంటల 10 నిమిషాలు

చతుర్థి తిథి ప్రారంభం- డిసెంబర్ 23, మధ్యాహ్నం 12:12 గంటలకు

చతుర్థి తిథి ముగింపు - డిసెంబర్ 24, 2025న మధ్యాహ్నం 01:11 గంటలకు

విజయ ముహూర్తం - 02:04 నుండి 02:45 వరకు

గోధులి ముహూర్తం - సాయంత్రం 05:28 నుండి సాయంత్రం 05:55 వరకు

సాయంత్రం సంధ్య - సాయంత్రం 05:30 నుండి 06:53 వరకు

అమృత కాలం - రాత్రి 09:23 నుండి 11:04 వరకు

నిషితా ముహూర్తం - రాత్రి 11:54 నుండి 12:48 వరకు

అమృత - సర్వోత్తం ఉదయం 08:29 నుండి 09:46 వరకు

సంకటహర చతుర్థి పూజా విధానం:

  • ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా విధానాన్ని పాటిస్తూ గణేశుడిని ఆరాధించండి.
  • వినాయకుడికి గరిక, ఎర్రటి పుష్పాలను సమర్పించండి.
  • లడ్డూ, ఉండ్రాళ్ళు, బెల్లం నైవేద్యం పెట్టండి.
  • 21 గరికలు వినాయకుడికి సమర్పించండి. గణేష్ స్తోత్రం లేదా గణేష్ శ్లోకాలను చదువుకోండి.
  • సంకటహర చతుర్థి ఉపవాస కథను పఠించండి. చివరగా క్షమాపణ చెప్పుకుని ప్రార్థించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe