...
...
Next Story

ఈరోజే వసంత పంచమి.. పూజ, అక్షరాభ్యాసం విధానంతో పాటు సరస్వతీ స్తోత్రం ఇదిగో

విద్య, వాక్కు, కళలకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతి దేవిని వసంత పంచమి నాడు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. వసంత పంచమి 2026 చాలా విశేషమైన రోజు. ఈ రోజు చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవు. పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. చాలా విద్యాలయాల్లో ప్రత్యేకంగా సరస్వతీ పూజలు నిర్వహిస్తారు.

Published on: Jan 23, 2026, 08:01:10 IST
Advertisement

ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వసంత పంచమి జనవరి 23, శుక్రవారం నాడు అనగా ఈరోజు వచ్చింది. ఇది చాలా పవిత్రమైన రోజు. చిన్నారుల జీవితంలో తొలి విద్యారంభానికి ఇది శుభప్రదమైన రోజు అని చెప్పొచ్చు.

వసంత పంచమి 2026

ఈరోజే వసంత పంచమి (pinterest)
ఈరోజే వసంత పంచమి (pinterest)

విద్య, వాక్కు, కళలకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతి దేవిని వసంత పంచమి నాడు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. వసంత పంచమి 2026 చాలా విశేషమైన రోజు. ఈ రోజు చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవు. పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తారు.

వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని.. జ్ఞానం, బుద్ధి, వాక్కు లభిస్తాయని నమ్ముతారు.

చాలా విద్యాలయాల్లో ప్రత్యేకంగా సరస్వతీ పూజలు నిర్వహిస్తారు.

పలకలు, పుస్తకాలు, పెన్నులు వంటి వాటిని పంచి పెడతారు. అలా చేయడం వలన అమ్మవారి ప్రత్యేక అనుగ్రహంతో ఆనందంగా ఉండవచ్చని నమ్మకం.

వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం ఎలా చేయించాలి?

అక్షరాభ్యాసం చేయించడానికి ముందు సరస్వతి దేవి పూజ చేయించాలి. పసుపు వస్త్రాలు, అక్షింతలు ఉపయోగిస్తారు.

అలాగే పిల్లల చేత బియ్యం లేదా పలకపై అక్షరాలు రాయిస్తారు.

“ఓం శ్రీ సరస్వతీ నమః” లేదా ఓంకారంతో విద్యారంభాన్ని మొదలుపెడతారు.

ఇలా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీ దేవి అనుగ్రహంతో ఆనందంగా ఉండవచ్చని విశ్వాసం.

వసంత పంచమి పూజ

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా

దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా

హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ

భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాసమానా

సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా..

సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా

విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా..

సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా

ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ..

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా..

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః

శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః

విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః

శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః

శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః

ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః

మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః

మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః

వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః

గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః

సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః

సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః

యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః

దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః

అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః

చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః

అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః

జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః

నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః

పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః

పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః

బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః

కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః

కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః

సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే

చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి

ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్

సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్..

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe