ఈరోజు గురువారం+పౌర్ణమి.. ఈ శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే విష్ణువు అనుగ్రహంతో డబ్బు, ఆనందంతో పాటు ఎన్నో
పౌర్ణిమ, గురువారం రావడం చాలా విశేషమైనదని చెప్పచ్చు. ఈ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే, విష్ణువు అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. అన్ని కష్టాల నుంచి బయటపడడానికి వీలవుతుంది. మరి గురువారం పౌర్ణమి సందర్భంగా ఏం చేస్తే కలిసి వస్తుంది? ఎలాంటి పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ భగవంతుని అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు, కానీ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. విష్ణువు అనుగ్రహం ఉంటే కష్టాల నుంచి బయట పడొచ్చు. గురువారం నాడు ప్రత్యేకించి విష్ణువును ఆరాధిస్తారు. పైగా ఈ గురువారం నాడు పౌర్ణమి కూడా ఉంది. అంతే కాకుండా ఈరోజు హనుమాన్ జయంతి కూడా.

పౌర్ణిమ, గురువారం రావడం చాలా విశేషమైనదని చెప్పచ్చు. ఈ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే, విష్ణువు అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. అన్ని కష్టాల నుంచి బయటపడడానికి వీలవుతుంది. మరి గురువారం పౌర్ణమి సందర్భంగా ఏం చేస్తే కలిసి వస్తుంది? ఎలాంటి పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు గురువారం+పౌర్ణమి.. ఈ పరిహారాలను పాటిస్తే విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు
పౌర్ణమి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, స్నానం చేసి పూజ గదిలో విష్ణు విగ్రహం లేదా ఫోటోని పెట్టి పూజించాలి. అలాగే విష్ణువుకు నెయ్యి దీపం వెలిగించి ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కోరికలు నెరవేరాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
గురువారం గురు బృహస్పతి బీజ మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. "ఓం బృం బృహస్పతయే నమః" అనే మంత్రాన్ని పఠించండి. వీలైతే 108 సార్లు పఠించొచ్చు.
గురువారం నాడు విష్ణువు అనుగ్రహం కలగాలంటే పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం.
ఈ శక్తివంతమైన పరిహారాలతో కష్టాలు అన్నీ తొలగిపోతాయి
అరటి చెట్టు పరిహారాలు:
గురువారం నాడు అరటి చెట్టుకు సంబంధించిన కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అరటి చెట్టు కింద దీపం వెలిగిస్తే గురువు, విష్ణువుల అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.
వంటగదిలో దీపం పెట్టండి:
చైత్ర పౌర్ణమి సందర్భంగా వంట గదిలో ఒక దీపం పెట్టండి. ఇది అన్నపూర్ణ దేవి అనుగ్రహాన్ని పొందడానికి సహాయం చేస్తుంది.
ముఖద్వారం దగ్గర దీపం పెట్టండి:
ఈరోజు పౌర్ణమి గురువారం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ముఖద్వారం దగ్గర దీపం పెట్టండి. ఇది డబ్బు మరియు ఆనందాన్ని తీసుకువస్తుంది. సంతోషంగా ఉండొచ్చు.
తులసి మొక్క దగ్గర దీపారాధన:
తులసి మొక్క దగ్గర ఈరోజు దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. చాలా రకాల సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


