ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ధన త్రయోదశి సందర్భంగా కొన్ని పరిహారాలను పాటించడం, కొన్ని తప్పులను చేయకుండా చూసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ధన త్రయోదశి నుంచి దీపావళి పండుగ మొదలవుతుంది.

దీపావళి పండుగను ఐదు రోజులు పాటు జరుపుతారు. ఆ రోజున ధన్వంతరి దేవుడిని, లక్ష్మీదేవిని, కుబేరుని పూజిస్తారు. అలా చేయడం వలన సకల సంతోషాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులకి అవకాశమే ఉండదని నమ్ముతారు. డబ్బుతో, సంపదతో సంతోషంగా ఉంటారు.
ధన త్రయోదశి తేదీ
ఈసారి ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చాలా మంది రకరకాల పరిహారాలను పాటిస్తారు. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుతారు.
మత విశ్వాసాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన త్రయోదశి నాడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే రకరకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ధన త్రయోదశి నాడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పొరపాటున కూడా ధన త్రయోదశి నాడు ఈ తప్పులు చేయకండి
1. సాయంత్రం ఇల్లు తుడవద్దు:
సూర్యాస్తమయం అయిన తర్వాత ధన త్రయోదశి నాడు ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం వంటి పొరపాట్లు చేయకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ముఖద్వారం ఎదురుగా తుడవడం వంటివి చేయకండి.
2. సాయంత్రం ఎవరికీ ఉప్పు ఇవ్వద్దు:
ఎప్పుడూ పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత ఉప్పు, పెరుగు, పుల్లటి ఆహార పదార్థాలను ఎవరికీ ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యంగా ధన త్రయోదశి నాడు కూడా వీటిని ఎవరికి ఇవ్వకండి. అలా చేసినట్లయితే ఇంట్లో టెన్షన్లు పెరిగిపోతాయి, రాహువు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
3. తలుపులు మూసి వేయకండి:
ధన త్రయోదశి నాడు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అలాంటి సమయంలో తలుపులు మూసి వేయడం వంటివి చేయకూడదు. దీపాలు వెలిగించడం, లైట్లు వేయడంతో పాటు తలుపులు తెరిచి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులకి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
4. డబ్బు అప్పుగా ఇవ్వకండి:
{{/usCountry}}ధన త్రయోదశి నాడు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అలాంటి సమయంలో తలుపులు మూసి వేయడం వంటివి చేయకూడదు. దీపాలు వెలిగించడం, లైట్లు వేయడంతో పాటు తలుపులు తెరిచి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులకి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
4. డబ్బు అప్పుగా ఇవ్వకండి:
{{/usCountry}}ధన త్రయోదశి నాడు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే కుబేరుడికే కోపం వస్తుందని, లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.
5. ఖాళీ సామాన్లు ఇంటికి తీసుకురావద్దు:
ధన త్రయోదశి నాడు రాగి, కంచు పాత్రలు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. అయితే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురావద్దు. నీళ్లు, బియ్యం, బెల్లం, పంచదార వంటి వస్తువులను వేసి ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు.