రేపు మాఘ అమావాస్య+మంగళవారం+ పంచగ్రహ కూటమి+సూర్యగ్రహణం.. నరదృష్టి పరిహారాలతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి!

ఫిబ్రవరి 17 అనగా రేపు మాఘ అమావాస్య. పైగా సూర్యగ్రహణం కూడా ఉంది. ఇలా అమావాస్య, సూర్యగ్రహణం రెండూ రావడం చాలా శక్తివంతమైనది. ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి.

Published on: Feb 16, 2026 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాఘ మాసం పూర్తి కాబోతోంది. ఫిబ్రవరి 17 అనగా రేపు మాఘ అమావాస్య. పైగా సూర్యగ్రహణం కూడా ఉంది. ఇలా అమావాస్య, సూర్యగ్రహణం రెండూ రావడం చాలా శక్తివంతమైనది. ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి. మాఘ అమావాస్య, సూర్య గ్రహణం వేళ ఈ పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది.

రేపు మాఘ అమావాస్య+మంగళవారం+ పంచగ్రహ కూటమి+సూర్యగ్రహణం (pinterest)
రేపు మాఘ అమావాస్య+మంగళవారం+ పంచగ్రహ కూటమి+సూర్యగ్రహణం (pinterest)

నరదృష్టి నుంచి ఇలా బయట పడండి

చాలా మంది నరదృష్టి కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా నరదృష్టి వలన చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నరదృష్టి, నరఘోష, శత్రువుల బాధలతో సతమతమవుతున్నట్లయితే ఈ పరిహారాలు అద్భుతంగా పని చేస్తాయి. నరదృష్టి చాలా పవర్‌ఫుల్. నరదృష్టి తగిలితే నల్ల రాయి కూడా పగిలిపోతుంది. నరదృష్టి ఏర్పడితే పిల్లలు భోజనం కూడా చేయలేరు. శరీరం కూడా బలహీనంగా మారిపోతుంది. నరదృష్టి వలన దేనిపైనా ఆసక్తి ఉండదు.

మాఘ అమావాస్య+పంచగ్రహ కూటమి+ సూర్యగ్రహణం

ఈ సమస్యలన్నిటిని తొలగించుకోవడానికి మాఘ అమావాస్య చాలా ఉత్తమమైన రోజు. పైగా పంచగ్రహ కూటమి, సూర్యగ్రహణం ప్రభావం వలన మరింత విశేషమైన రోజు అని చెప్పొచ్చు. సూర్యగ్రహణం ప్రభావం మన భారతదేశంలో కనిపించకపోయినా ఆ ప్రభావం ఉంటుంది. గ్రహణ కాలం మధ్యాహ్నం ఉండడం, అదే సమయంలో మంగళవారం రాహుకాలం కారణంగా కలిసి రావడంతో ఈ పరిహారాలను పాటిస్తే మంచిది.

వీటిని ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశంలో కట్టండి

ఎర్రటి వస్త్రంలో బూడిద గుమ్మడికాయను పెట్టి, గవ్వలు, నల్ల జీడిగింజలు, నల్ల తోక మిరియాలు, ఉప్పు, మిరపకాయలు, పటిక బెల్లం వేసి మూట కట్టి మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు మధ్యలో ఇంటి గుమ్మం లేదా వ్యాపార స్థలంలో కట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి నుంచి బయటపడొచ్చు.

మాఘ అమావాస్య నాడు చేయాల్సినవి :

  • మాఘ అమావాస్య నాడు సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు. “మాఘ” అంటే పాపాలు పోగొట్టేది అని అర్థం.
  • మాఘ అమావాస్య నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
  • అలాగే కుదిరితే సూర్య ఆలయాన్ని సందర్శించండి. నిమ్మకాయల దండను సమర్పిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
  • బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలను దానం ఇస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు.
  • ఈ విశేషమైన రోజున గోమాతకు ఆహారంగా శనగలు, బెల్లం, రొట్టెలు వంటివి అందించండి.
  • గొడుగు, చెప్పులు వంటివి దానం చేస్తే కూడా మంచి ఫలితాలను చూడచ్చు.

అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి

  • అమావాస్యనాడు గొడవలు, తిట్టుకోవడం వంటివి చేయొద్దు. ప్రశాంతంగా ఉండండి.
  • అమావాస్య నాడు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు.
  • కొత్త పనులను ప్రారంభించడానికి కూడా అమావాస్య మంచిది కాదు.
  • ముఖ్యమైన ప్రయాణాలు కూడా చేయొద్దు.
  • మాంసాహారం తీసుకోవద్దు.
  • పూజా వస్తువులు మొదలైన పవిత్రమైన వాటిని కొనుగోలు చేయకండి.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More