ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటారు. ఒక్కో రాశి వారు కొన్నిట్లో దృఢంగా ఉంటే, అదే మరి కొన్ని రాశుల వారికి బలహీనత అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని, కోరుకున్న వ్యక్తి వారి జీవితంలోకి రావాలని అనుకుంటారు. మన జీవితంలో ప్రేమ, అనురాగం చాలా ముఖ్యమైన అనుభూతులు. అయితే భాగస్వామిని ఎక్కువగా ప్రేమించడం, వారిని సంతోషంగా ఉంచడం అందరికీ కుదరదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక మనిషి ప్రేమ తత్వం, వారి రొమాంటిక్ ప్రవర్తన అనేది రాశిపై కూడా ఆధారపడి ఉంటుంది. శృంగారానికి, అందానికి, ఆకర్షణకు అధిపతి శుక్రుడు. శుక్రుడి ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు సహజంగానే ఎక్కువ రొమాంటిక్‌గా ఉంటారు. అలాగే వారి భాగస్వామి కోసం ఏదైనా త్యాగం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి ఆ రాశుల వారు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
1.వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. దీంతో వీరు పుట్టుకతోనే అమితమైన రొమాంటిక్ మనస్తత్వంతో ఉంటారు. అలాగే ఈ రాశి వారు ప్రేమించిన వారి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. భాగస్వామికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం, సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేయడం వంటివి కూడా చేస్తారు. వృషభ రాశి వారు నమ్మకానికి మారుపేరు అని చెప్పొచ్చు. అలాగే బంధాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. భాగస్వామిని కష్టపెట్టరు. ఒకసారి మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమిస్తే, జీవితాంతం వారికి నీడలా నిలుస్తారు.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు చంద్రుడి ఆధిపత్యం వలన భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాస్త గంభీరంగా కనిపించినా, మనసంతా ప్రేమతో నిండి ఉంటుంది. అలాగే భాగస్వామి చిన్న అలకను కూడా ఏ మాత్రం తట్టుకోలేరు. ఈ రాశి వారు ప్రత్యేకమైన శైలిలో ప్రేమను వ్యక్తపరుస్తారు. భాగస్వామి గురించి ఎక్కువ కేర్ చూపిస్తారు. మానసికంగా, శారీరకంగా వారికి రక్షణగా నిలుస్తూ ఉంటారు.
3.తులా రాశి
తులా రాశి వారు బంధాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. శుక్రుడు అధిపతి కావడం వల్ల ఈ రాశి వారు రొమాన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలా రొమాంటిక్‌గా ఉంటారు. భాగస్వామితో గొడవపడటానికి ఏ మాత్రం ఇష్టపడరు. మనస్పర్థలు వచ్చినా కూడా సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామి సంతోషం కోసం ప్రతి క్షణం తపిస్తారు.
4.మీన రాశి
{{/usCountry}}తులా రాశి వారు బంధాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. శుక్రుడు అధిపతి కావడం వల్ల ఈ రాశి వారు రొమాన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలా రొమాంటిక్‌గా ఉంటారు. భాగస్వామితో గొడవపడటానికి ఏ మాత్రం ఇష్టపడరు. మనస్పర్థలు వచ్చినా కూడా సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామి సంతోషం కోసం ప్రతి క్షణం తపిస్తారు.
4.మీన రాశి
{{/usCountry}}మీన రాశి వారు ఎప్పుడూ ఊహాలోకంలో ఉండడానికి ఇష్టపడతారు. భాగస్వామి కళ్లల్లో ఆనందం చూడడానికి పరితపిస్తారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, వారి ప్రేమను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడరు.