త్రిగ్రాహి యోగం 2026: సింహ రాశిలో మూడు గ్రహాల కలయిక.. ఈ 7 రాశులకు రెండు రోజులు అదృష్టమే అదృష్టం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సింహ రాశిలో గురుడు, కేతువు, చంద్రుడు కలవడంతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. సూర్యుడి స్వక్షేత్రమైన సింహ రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక ప్రభావంతో ఏడు రాశుల వారికి రాబోయే రెండు రోజులు అనుకూలంగా ఉండనున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల కలయిక కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులను తీసుకువస్తుంది. ప్రస్తుతం జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, దేవగురువు బృహస్పతి, మోక్షకారక కేతువు ఇప్పటికే సూర్యుడి ఆధిపత్యం ఉన్న సింహ రాశిలో సంచరిస్తున్నారు. అయితే, తాజాగా చంద్రుడు కూడా సింహ రాశిలోకి ప్రవేశించడంతో అక్కడ అత్యంత శక్తివంతమైన 'త్రిగ్రాహి యోగం' ఆవిర్భవించింది.

సూర్యుడి స్వక్షేత్రమైన సింహ రాశిలో ఈ మూడు బలమైన గ్రహాలు కలవడం వల్ల కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. ఈ యోగ ప్రభావంతో ఏడు ప్రధాన రాశుల వారికి రాబోయే రెండు రోజులు తిరుగులేని లాభాలు కలగనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఏయే రాశులపై త్రిగ్రాహి యోగ ప్రభావం ఎలా ఉంటుంది?
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ గ్రహాల కలయిక ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి లేదా బంధువుల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
2.మిథున రాశి:
ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న మిథున రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ధన లాభం కలగడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ప్రేమ జీవితంలో నెలకొన్న అపార్థాలు తొలగిపోయి, భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
3.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఆర్థిక పరిస్థితి బలపడటంతో పాటు కుటుంబంలో సిరిసంపదలు వర్ధిల్లుతాయి. ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
4.సింహ రాశి:
సొంత రాశిలోనే ఈ యోగం ఏర్పడటం వల్ల సింహ రాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు.
5.తులా రాశి:
తులా రాశి వారికి ఈ కాలం అత్యంత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా సంతానం ద్వారా మీకు ఎంతో గర్వకారణమైన వార్తలు అందుతాయి. జీవితంలో కొత్త ఉత్సాహం సంతరించుకుంటుంది.
6.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా తిరుగులేని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లేదా అనుకూలమైన మార్పులు ఉంటాయి. చేసే ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు రావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి.
7.ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ గ్రహాల కలయిక సానుకూల ఫలితాలను అందిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా మారుతుంది. పట్టుదలతో చేసే పనుల్లో విజయం సాధించి, ఆర్థికంగా స్థిరపడతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


