మంగళవారం చదువుకోవాల్సిన హనుమాన్ శ్లోకాలు, పూజా విధానం.. సక్సెస్, ఉద్యోగం, సంతోషం కోసం పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోండి
మంగళవారం నాడు హనుమంతుని అనుగ్రహం పొందడానికి చాలా ఉత్తమమైన రోజు. ఈ రోజు హనుమంతుడిని పూజించేటప్పుడు సుందరకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.
మంగళవారం నాడు హనుమంతుడిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. మంగళవారం నాడు హనుమంతుని అనుగ్రహం పొందడానికి చాలా ఉత్తమమైన రోజు. ఈ రోజు హనుమంతుడిని పూజించేటప్పుడు సుందరకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, ఆ తర్వాత ధ్యానం ప్రారంభించాలి.

సుందరకాండ
పూజ గదిలో హనుమంతుడి ఫోటోను లేదా విగ్రహాన్ని ఆరాధించి, ఆ తర్వాత సుందరకాండ పఠించాలి. హనుమంతుడు ముందు సీతారాముల ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టేటట్టు చూసుకోండి. సింధూరంతో హనుమంతుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. సుందరకాండ పారాయణానికి ముందే వినాయకుడిని పూజించి, ఆ తర్వాత సుందరకాండ పారాయణం చేయండి.
హనుమాన్ చాలీసా పారాయణం
హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. మంగళవారం నాడు సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి రామ నామాన్ని జపిస్తే కూడా మంచి ఫలితాలను చూడొచ్చు. సంక్షోభాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. మంగళవారం నాడు ఉపవాసం ఉండి పేదవారికి అన్నదానం చేస్తే హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.
ఉద్యోగం కోసం చాలా కాలంగా శ్రమిస్తున్న వారు హనుమాన్ పాదాల దగ్గర తమలపాకులను సమర్పిస్తే విజయాలను అందుకోవచ్చు. ఆదాయం పొందడానికి హనుమంతుడికి గులాబీ పూలను సమర్పించండి. అలాగే ఇక్కడ ఉన్న హనుమాన్ శ్లోకాలను కూడా మంగళవారం నాడు చదువుకుని హనుమాన్ అనుగ్రహాన్ని పొందండి.
హనుమాన్ అనుగ్రహం పొందడానికి చదువుకోవాల్సిన శ్లోకాలు
1.మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే
2. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం..
3. అంజనానందనం వీరం జానకీ శోక నాశనం
కపీశమక్ష హంతారం వందే లంకాభయంకరం
4. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్
5. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయం
6. అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం
సకలగుణ నిధానం వానరాణామధీశం రఘుపతిప్రియ భక్తం వాతజాతం నమామి..
7. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం..
8. ఆంజనేయమతిపాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవమాన నందనం
9. ఆముషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం
తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం
10. శ్రీ హనుమతే నమః
సంకటమోచనాయ నమః
రామదూతాయ నమః
అంజనేయాయ నమో నమః
11.అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో
12 ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్
13. శ్రీరామ దూతం శిరసా నమామి వాయుపుత్రం మహాబలమ్
సీతాశోక వినాశాయం లంకాదహన తత్పరం..
14. హనుమంతం మహావీరం రామభక్తం దయానిధిం
వాయుపుత్రం నమామ్యహం సర్వశత్రు వినాశనం
15. మంగళం ఆంజనేయాయ మంగళం వాయుపుత్రాయ
మంగళం రామదూతాయ మంగళం భక్తవత్సల
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


