ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు!

కొన్ని తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే నిజానికి ప్రతి సంఖ్యకూ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. 2026 వచ్చేసింది. అప్పుడే ఒక వారం కూడా పూర్తయిపోయింది. 2026లో కొన్ని సంఖ్యల వారికి ఎక్కువ లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ సంఖ్యల వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

Published on: Jan 9, 2026, 08:00:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు (pinterest)

కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే నిజానికి ప్రతి సంఖ్యకూ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. 2026 వచ్చేసింది. అప్పుడే ఒక వారం కూడా పూర్తయిపోయింది. 2026లో కొన్ని సంఖ్యల వారికి ఎక్కువ లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ సంఖ్యల వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

సూర్యుడితో ముడిపడి ఉన్న 2026

ఇది సూర్య సంవత్సరం. శని, గురు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడంతో కొన్ని లాభాలు కలుగుతాయి. ఈ సంఖ్యల వారికే ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఆ అదృష్ట సంఖ్యలు ఎవరు? మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.

ఈ సంఖ్యల వారికి 2026లో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం

కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఏ పని ప్రారంభించినా కూడా ఆటంకాలు ఉండవు. శ్రద్ధ కూడా ఎక్కువ అవుతుంది. చదువుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

1, 10 తేదీల్లో పుట్టిన వారు

ఏదైనా నెలలో 1, 10 తేదీల్లో పుట్టిన వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం కనపడుతోంది. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారొచ్చు. నిరంతరం కష్టపడి శ్రమించినట్లయితే కచ్చితంగా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది.

4, 22 తేదీల్లో పుట్టిన వారు

ఏదైనా నెలలో 4, 22 తేదీల్లో పుట్టినట్లయితే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తేదీల్లో పుట్టిన వారికి రాహువు అనుగ్రహం ఉంటుంది. అందుకని ఏ పనిని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే శ్రద్ధ పెరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు. భిన్నంగా ఆలోచిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు.

28, 13, 19 తేదీల్లో పుట్టిన వారు

ఏదైనా నెలలో 28, 13, 19 తేదీల్లో పుట్టినట్లయితే వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కష్టపడి ట్రై చేస్తే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. 13, 19 తేదీల వారిపై శని, సూర్య గ్రహాల అనుకూల దృష్టి ఉంటుంది. దీంతో కలిసి వస్తుంది. అలాగే 28న పుట్టిన వారికి గురువు అనుకూలంగా ఉంటుంది. దీంతో కష్టపడితే ఎక్కువ త్వరగా విజయం లభిస్తుంది. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారు కొంచెం కష్టపడితే, గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More