...
...
Next Story

రేపు క్షీరాబ్ది ద్వాదశి.. తులసమ్మకు ఈ 108 నామాలతో పూజ చేస్తే శుభ ఫలితాలు!

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి: కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున తులసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం, తులసి కల్యాణం చేయడం విశేషంగా భావిస్తారు. శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళిలోని 108 నామాలను భక్తిశ్రద్ధలతో పఠిస్తారు

Published on: Nov 20, 2026, 14:00:51 IST
Advertisement

రేపు ఎంతో విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశి. ఆ రోజున తులసమ్మను పూజించడం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశిని చిలుక ద్వాదశి అంటారు. చాలా మంది క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కల్యాణాన్ని నిర్వహిస్తారు. తులసి కోటను అందంగా అలంకరించి, పసుపు, కుంకుమలు సమర్పించి, దీపారాధన చేసి, శతనామావళిని పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

రేపు క్షీరాబ్ది ద్వాదశి.. తులసమ్మకు ఈ 108 నామాలతో పూజ చేస్తే శుభ ఫలితాలు! (AI)
రేపు క్షీరాబ్ది ద్వాదశి.. తులసమ్మకు ఈ 108 నామాలతో పూజ చేస్తే శుభ ఫలితాలు! (AI)

తులసి అష్టోత్తరంలోని 108 నామాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నామాలతో తులసమ్మను భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే, తులసి కోట దగ్గర ఉసిరి దీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. కనుక ఈరోజును సద్వినియోగం చేసుకుంటే ఆ శ్రీహరి అనుగ్రహంతో సుఖసంతోషాలు, సౌభాగ్యం కలుగుతాయి.

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి

1. ఓం తులస్యై నమః

2. ఓం పావన్యై నమః

3. ఓం పూజ్యాయై నమః

4. ఓం బృందావననివాసిన్యై నమః

5. ఓం జ్ఞానదాత్ర్యై నమః

6. ఓం జ్ఞానమయ్యై నమః

7. ఓం నిర్మలాయై నమః

8. ఓం సర్వ పూజితాయై నమః

9. ఓం సత్యై నమః

10. ఓం పతి వ్రతాయై నమః

11. ఓం బృందాయై నమః

12. ఓం క్షీరాబ్ధి మథనోద్భవాయై నమః

13. ఓం కృష్ణవర్ణాయై నమః

14. ఓం రోగహంత్ర్యై నమః

15. ఓం త్రివర్ణాయై నమః

16. ఓం సర్వకామదాయై నమః

17. ఓం లక్ష్మీసఖ్యై నమః

19. ఓం సుదత్యై నమః

20. ఓం భూమిపావన్యై నమః

21. ఓం హరిద్రాన్నైకనిరతాయై నమః

22. ఓం హరిపాద కృతాలయాయై నమః

23. ఓం పవిత్ర రూపిణ్యై నమః

24. ఓం ధన్యాయై నమః

25. ఓం సుగంధిన్యై నమః

26. ఓం అమృతోద్భవాయై నమః

27. ఓం సురూపారోగ్యదాయై నమః

28. ఓం తుష్టాయై నమః

29. ఓం శక్తిత్రితయరూపిణ్యై నమః

30. ఓం దేవ్యై నమః

31. ఓం దేవర్షిసంస్తుత్యాయై నమః

32. ఓం కాంతాయై నమః

33. ఓం విష్ణుమనఃప్రియాయై నమః

34. ఓం భూతవేతాలభీతిఘ్న్యై నమః

35. ఓం మహాపాతకనాశిన్యై నమః

36. ఓం మనోరథప్రదాయై నమః

37. ఓం మేధాయై నమః

38. ఓం కాంత్యై నమః

39. ఓం విజయదాయిన్యై నమః

40. ఓం శంఖచక్రగదాపద్మధారిణ్యై నమః

41. ఓం కామరూపిణ్యై నమః

42. ఓం అపవర్గప్రదాయై నమః

43. ఓం శ్యామాయై నమః

44. ఓం కృశమధ్యాయై నమః

45. ఓం సుకేశిన్యై నమః

46. ఓం వైకుంఠవాసిన్యై నమః

47. ఓం నందాయై నమః

48. ఓం బింబోష్ఠ్యై నమః

49. ఓం కోకిలస్వరాయై నమః

50. ఓం కపిలాయై నమః

51. ఓం నిమ్నగాజన్మభూమ్యై నమః

52. ఓం ఆయుష్యదాయిన్యై నమః

53. ఓం వనరూపాయై నమః

54. ఓం దుఃఖనాశిన్యై నమః

55. ఓం అవికారాయై నమః

56. ఓం చతుర్భుజాయై నమః

57. ఓం గరుత్మద్వాహనాయై నమః

58. ఓం శాంతాయై నమః

59. ఓం దాంతాయై నమః

60. ఓం విఘ్ననివారిణ్యై నమః

61. ఓం శ్రీవిష్ణుమూలికాయై నమః

62. ఓం పుష్ట్యై నమః

63. ఓం త్రివర్గఫలదాయిన్యై నమః

64. ఓం మహాశక్త్యై నమః

65. ఓం మహామాయాయై నమః

66. ఓం లక్ష్మీవాణీసుపూజితాయై నమః

67. ఓం సుమంగళ్యర్చనప్రీతాయై నమః

68. ఓం సౌమంగళ్యవివర్ధిన్యై నమః

69. ఓం చాతుర్మాస్యోత్సవారాధ్యాయై నమః

70. ఓం విష్ణుసాన్నిధ్యదాయిన్యై నమః

71. ఓం ఉత్థానద్వాదశీపూజ్యాయై నమః

72. ఓం సర్వదేవప్రపూజితాయై నమః

73. ఓం గోపీరతిప్రదాయై నమః

74. ఓం నిత్యాయై నమః

75. ఓం నిర్గుణాయై నమః

76. ఓం పార్వతీప్రియాయై నమః

77. ఓం అపమృత్యుహరాయై నమః

78. ఓం రాధాప్రియాయై నమః

79. ఓం మృగవిలోచనాయై నమః

80. ఓం అమ్లానాయై నమః

81. ఓం హంసగమనాయై నమః

82. ఓం కమలాసనవందితాయై నమః

83. ఓం భూలోకవాసిన్యై నమః

84. ఓం శుద్ధాయై నమః

85. ఓం రామకృష్ణాదిపూజితాయై నమః

86. ఓం సీతాపూజ్యాయై నమః

87. ఓం రామమనఃప్రియాయై నమః

88. ఓం నందనసంస్థితాయై నమః

89. ఓం సర్వతీర్థమయ్యై నమః

90. ఓం ముక్తాయై నమః

91. ఓం లోకసృష్టివిధాయిన్యై నమః

92. ఓం ప్రాతర్దృశ్యాయై నమః

93. ఓం గ్లానిహంత్ర్యై నమః

94. ఓం వైష్ణవ్యై నమః

95. ఓం సర్వసిద్ధిదాయై నమః

96. ఓం నారాయణ్యై నమః

97. ఓం సంతతిదాయై నమః

98. ఓం మూలమృద్ధారిపావన్యై నమః

99. ఓం అశోకవనికాసంస్థాయై నమః

100. ఓం సీతాధ్యాతాయై నమః

101. ఓం నిరాశ్రయాయై నమః

102. ఓం గోమతీసరయూతీరరోపితాయై నమః

103. ఓం కుటిలాలకాయై నమః

104. ఓం అపాత్రభక్ష్యపాపఘ్న్యై నమః

105. ఓం దానతోయవిశుద్ధిదాయై నమః

106. ఓం శ్రుతిధారణసుప్రీతాయై నమః

107. ఓం శుభాయై నమః

108. ఓం సర్వేష్టదాయిన్యై నమః

తులసీ అష్టోత్తర శతనామావళి సమాప్తం..

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks