...
...
Next Story

Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులకు జాక్‌పాట్‌.. ఆస్తులు, ధన లాభంతో పాటు మరెన్నో!

వసంత ఋతువు ప్రారంభంలో ఉగాది పండుగను జరుపుకుంటాము. ఆ రోజు ఆరు రుచులతో కూడిన షడ్రుచుల పచ్చడిని చేసుకుంటాము. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. ఈసారి వచ్చే తెలుగు నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. ఈ రాశుల వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ రాశులకి జాయింట్ బిజినెస్‌లో కూడా లాభాలు వస్తాయి.

Published on: Feb 24, 2026, 15:00:13 IST
Advertisement

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది. తెలుగు వారి నూతన సంవత్సరం (Ugadi 2026) ప్రారంభమవుతుంది. వసంత ఋతువు ప్రారంభంలో ఉగాది పండుగను జరుపుకుంటాము. ఆ రోజు ఆరు రుచులతో కూడిన షడ్రుచుల పచ్చడిని చేసుకుంటాము. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. ఈసారి వచ్చే తెలుగు నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం.

ఉగాది

Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులకు జాక్‌పాట్‌ (pinterest)
Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులకు జాక్‌పాట్‌ (pinterest)

బ్రహ్మ ఉగాది నాడు సృష్టిని ప్రారంభించాడని, వసంత ఋతువు ప్రారంభమవుతుందని అంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఉగాది నాడు కొత్త బట్టలు కట్టుకొని, పూజలు చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అలాగే ఉగాది నాడు పంచాంగ శ్రవణం వింటారు. రాబోయే ఏడాది ఆదాయం, వ్యయం, రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు.

మనము ఋతువులను బట్టి పండుగలను జరుపుకుంటాము. ఉగాది కూడా ఋతువు ఆధారంగా జరిపే పండుగ. శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి అడుగుపెట్టే నాడు ఉగాది పండుగను జరుపుకుంటాము. మరి ఇక పరాభవ నామ సంవత్సరం ఏ రాశుల వారికి కలిసి రాబోతోంది? పరాభవ నామ సంవత్సరంలో ఏ రాసులు వారు జాక్పాట్ కొట్టబోతున్నారో తెలుసుకుందాం.

పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశుల వారు జాక్‌పాట్‌ కొడతారు

ఈ రాశుల వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఏడు రాశుల వారికి పరాభవ నామ సంవత్సరం విపరీతంగా కలిసి రాబోతోంది. ఉగాది తర్వాత ఈ రాశుల వారికి భారీగా లాభాలు కలగబోతున్నాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు ఉంటాయి.

మనశ్శాంతి లేక చాలా కాలంగా కష్టపడుతున్న వృశ్చిక రాశి వారికి పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రాబోతోంది. మీన రాశి వారికి కూడా పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రాబోతోంది. కర్కాటక రాశి వారికి కూడా ఈ కొత్త తెలుగు నామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అంతే కాక అక్టోబర్ తర్వాత మేష రాశి, సింహ రాశి, మకర రాశి, ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ ఏడు రాశుల వారికి పరాభవ నామ సంవత్సరం విపరీతంగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి.

పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశుల వారికి ధన ఆదాయం పెరుగుతుంది

.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks