...
...
Next Story

Ugadi 2026 Telugu Wishes and Quotes: స్నేహితులకు, బంధువులకు పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

Ugadi 2026 Telugu Wishes and Quotes: పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయి పరాభవ నామ సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అందరూ అన్నీ కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని మొదటి రోజు నుంచి కొత్త ఏడాది అంతా బాగుండాలని అనుకుంటారు.

Published on: Mar 18, 2026, 12:00:15 IST
Advertisement

Ugadi 2026 Telugu Wishes and Quotes: పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయి పరాభవ నామ సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అందరూ అన్నీ కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని మొదటి రోజు నుంచి కొత్త ఏడాది అంతా బాగుండాలని అనుకుంటారు.

Ugadi 2026 Telugu Wishes and Quotes: స్నేహితులకు, బంధువులకు పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి! (pinterest)
Ugadi 2026 Telugu Wishes and Quotes: స్నేహితులకు, బంధువులకు పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి! (pinterest)

కొత్త తెలుగు సంవత్సరం (Ugadi 2026) మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? అయితే వారికి ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి.

Ugadi 2026 Telugu Wishes and Quotes: స్నేహితులకు, బంధువులకు ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి:

ఈ ఉగాది మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఇంకా దగ్గర చేసి ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు.

ఉగాది సందర్భంగా మీ కలలు వికసించాలి. మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఉగాది.

గతాన్ని వదిలేసి కొత్త ఏడాదిలో అంతులేని అవకాశాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

తీపి-చేదు కలిసిందే జీవితం. కష్టం-సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

ఈ ఉగాది పండుగ మీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని, మీ కుటుంబంలో సంతోషం, శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు.

ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ ఉగాది. ఈ శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.

పాత సంవత్సరపు చేదు-తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మీ ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

జీవితం సకల అనుభూతుల సమ్మేళనం. స్థితప్రజ్ఞత అలవర్చుకోవడం వివేకి లక్షణం. అదే ఉగాది తెలిపే సందేశం. మీకు, మీ కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

కాలం పరుగులో మరో మైలురాయి కొత్త సంవత్సరం. ఈ సంవత్సరం అంతా జయాలు కలగాలని, సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు..

మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…

Ugadi 2026 Telugu Wishes and Quotes: స్నేహితులకు, బంధువులకు ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

ఈ కొత్త తెలుగు సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంతృప్తి ఇవ్వాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

మీ కుటుంబ సభ్యులకు, మీకు ఎల్లప్పుడూ శ్రేయస్సు, సంతృప్తి, ఆనందం, శాంతి ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం.

లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ఆ ముగ్గులతో వేడి వాకిళ్లు, కొత్త బట్టలతో పిల్లా పాపలు.. ఉగాది పండుగ సంబరాలు. నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

తిమిరాన్ని పారద్రోల్లే ఉషోదయంలా, చిగురాకుల ఊయలతో నవరాగాల కోయిలలా అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం. ఈ ఉగాది నీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. హ్యాపీ ఉగాది.

కోయిలమ్మ పాటతో, వేప పువ్వు చేదుతో, మామిడి వగరతో వచ్చే ఈ ఉగాది సకల శుభాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది.

నూతన ఉత్సాహంతో, సరికొత్త ఆశలతో ప్రారంభమవుతున్న పరాభవ నామ సంవత్సరం మీకు అంతా శుభాలే చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు.

జీవితం షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడిలాగే మీ జీవితంలో కూడా కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe