ఈరోజే కొత్త అమావాస్య.. గ్రామదేవతలను ఎలా ఆరాధించాలి? చేయాల్సినవి, చేయకూడని తప్పులు ఏంటో తెలుసుకుందాం!
ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్యని (Amavasya) కొత్త అమావాస్య అని అంటారు. అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. తెలుగు సంవత్సరాదికి ముందు రోజున ఈ అమావాస్య వస్తుంది. గ్రామ దేవత ప్రజలు ఈ రోజున జాతర ఉత్సవం నిర్వహిస్తారు. మసూచి, అమ్మవారు వంటి సమస్యలు ఊరికి రాకుండా ఉండాలని గ్రామ దేవతలను ఆరాధిస్తారు.
విశ్వావసునామ సంవత్సరం పూర్తి కాబోతోంది. పరాభవనమ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్యని (Amavasya) కొత్త అమావాస్య అని అంటారు. అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. తెలుగు సంవత్సరాదికి ముందు రోజున ఈ అమావాస్య వస్తుంది. గ్రామ దేవత ప్రజలు ఈ రోజున జాతర ఉత్సవం నిర్వహిస్తారు. మసూచి, అమ్మవారు వంటి సమస్యలు ఊరికి రాకుండా ఉండాలని, పాడి పంటలు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య నాడు గ్రామ దేవతలను ఆరాధిస్తారు.

చతుర్దశి నాడు జాగారంతో జాతర మొదలై, గరగల నృత్యాలు, మేళతాళాలు, పులి వేషాలతో వైభవంగా జరుపుతారు. కొత్త అమావాస్య పండుగ నాడు తెలుగు వారు గ్రామదేవతలను దర్శించుకుని ఆరాధిస్తారు. మొక్కుబడులను కూడా తీర్చుకుంటారు. అమ్మవారికి స్త్రీలు పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు మొదలైన వాటిని భక్తితో చెల్లిస్తారు. అలాగే పిండి వంటకాలతో నైవేద్యాలను పెడతారు.
కొత్త అమావాస్య నాడు గ్రామదేవాలను ఎలా ఆరాధించాలి?
ఈ అమావాస్యనాడు కచ్చితంగా గ్రామదేవతలను ఆరాధించాలి. దగ్గరలో ఉన్న గ్రామదేవత ఆలయానికి వెళ్లి దేవతకు పసుపు, కుంకుమలు, పువ్వులు, చీర, జాకెట్ ఇలా మీకు తోచినవి సమర్పించి దీపారాధన చేయడం వలన మంచి జరుగుతుంది. ఇలా చేయడం వలన గ్రామదేవతల అనుగ్రహం కలుగుతుంది. కొత్త సంవత్సరం అంతా సకల శుభాలను తీసుకొస్తుంది. దగ్గరలో గ్రామదేవత ఆలయం లేకపోతే దుర్గాదేవి ఆలయానికి వెళ్లి వీటిని సమర్పించవచ్చు.
కొత్త అమావాస్య నాడు తప్పక పాటించాల్సినవి
- కొత్త అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శివుడుని ఆరాధించాలి. మాంసాహారం తీసుకోకూడదు. ఇంట్లో శాంతి వాతావరణం కలిగి, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఇది పాటించండి.
- అలాగే పితృదేవతలకు పూజలు చేయడం వలన కూడా మంచి ఫలితాలను చూస్తారు. అమావాస్య రోజు ఇంటి ముందు దీపాన్ని పెట్టండి. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
- శని దోషాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.
- అమావాస్యనాడు ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే అప్పుల బాధల నుంచి బయటపడి ఆనందంగా ఉండొచ్చు. అమావాస్య నాడు ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయడం వలన దరిద్రం కూడా తొలగిపోతుంది. అదృష్టం కూడా కలుగుతుంది.
పొరపాటున కూడా ఈ కొత్త అమావాస్య నాడు తప్పులు చేయకండి
దీనిని భూతాది అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య రాత్రి సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా, చీకటి పడిన తర్వాత ఎవరూ తిరగని చోటుకు వెళ్లడం వంటివి చేయొద్దు.
మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు కలగకుండా చూసుకోండి.
గోర్లు కత్తిరించడం, గడ్డం గీయడం, జుట్టు కత్తిరించడం వంటివి చేయొద్దు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో గొడవలు, వాదనలు కూడా పెరుగుతాయి.
సూర్యోదయం తర్వాత ఎక్కువసేపు నిద్రపోవద్దు. బ్రహ్మ ముహూర్తంలో లేచి దేవుని ప్రార్థించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రశాంతత ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


