వైభవ లక్ష్మీ రాజయోగం: శుక్ర, చంద్రుల కలయికతో మూడు రాశులకు భారీ లాభాలు.. డబ్బు, సంతోషం, విజయాలతో పాటు ఎన్నో!
శుక్రుడు డబ్బు, విలాసాలు, ప్రేమ, అందం మొదలైన వాటికి కారకుడు. చంద్రుడు మానసిక ప్రశాంతతను తీసుకొస్తాడు. ఈ గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారు అనేక లాభాలను పొందబోతున్నారు. ఏప్రిల్ 18న చంద్రుడు, శుక్రుడు కలయిక ఏర్పడడంతో ఈ వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారు అనేక లాభాలను పొందబోతున్నారు.
ప్రతి గ్రహానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. త్వరలోనే వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది.

ఏప్రిల్ 18న చంద్రుడు, శుక్రుడు కలయిక ఏర్పడడంతో ఈ వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు డబ్బు, విలాసాలు, ప్రేమ, అందం మొదలైన వాటికి కారకుడు. చంద్రుడు మానసిక ప్రశాంతతను తీసుకొస్తాడు. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారు అనేక లాభాలను పొందబోతున్నారు.
శక్తివంతమైన వైభవ లక్ష్మీ రాజయోగం
శుక్రుడు మార్చి 26న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 18న చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది వైభవ లక్ష్మీ రాజయోగాన్ని అందిస్తుంది. ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు.
వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. మరి ఈ వైభవ లక్ష్మీ రాజయోగం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్ర, చంద్రుల కలయికతో వైభవ లక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు:
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ రాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. అనేక విధాలుగా సానుకూల మార్పులను చూస్తారు. ఈ రాశి మొదటి ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. కెరీర్‌లో కూడా అనేక మార్పులు వస్తాయి.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఇది అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో చక్కటి మార్పులను చూస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. ఈ గ్రహాల కలయికతో సుఖ సంతోషాలను పొందుతారు.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి ఇది అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇలా ఈ రాశి వారు కూడా ఈ రెండు గ్రహాల కలయికతో అనేక మార్పులను చూస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


