ఏప్రిల్ 14న సూర్య-చంద్రుల 'వైధృతి యోగం': ఈ 4 రాశుల వారు జాగ్రత్త.. జేబు ఖాళీ అయ్యే ఛాన్స్!

ఖగోళంలో గ్రహాల కదలికలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏప్రిల్ నెలలో గ్రహాల రాజు సూర్యుడు రాశిని మార్చబోతున్నాడు. ఇదే సమయంలో సూర్య, చంద్రుల కలయిక వల్ల 'వైధృతి యోగం' అనే అశుభ యోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి తప్పవని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Apr 11, 2026, 13:30:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తాయి. అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో ప్రమాదకరమైన సంయోగం జరగబోతోంది. సూర్య-చంద్రుల కలయిక వలన ఏర్పడే వైధృతి యోగం కొన్ని రాశుల వారికి నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి ఆర్థిక నష్టం, ఒత్తిడి సమస్యలతో నిండిపోతుంది. కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జేబులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్ 14న సూర్య-చంద్రుల 'వైధృతి యోగం': ఈ 4 రాశుల వారు జాగ్రత్త
ఏప్రిల్ 14న సూర్య-చంద్రుల 'వైధృతి యోగం': ఈ 4 రాశుల వారు జాగ్రత్త

ఏప్రిల్ 14న గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్య-చంద్రులు 180 డిగ్రీల దూరంలో ఉండడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఏప్రిల్ 13 రాత్రి 12:13 నుంచి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 14 వరకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే చిన్నపాటి ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది.

సూర్య, చంద్రుల ప్రమాదకరమైన వైధృతి యోగం.. ఈ రాశుల వారికి నష్టాలు

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఇబ్బందులు పెరుగుతాయి. తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కలహాలు ఉండొచ్చు. యాక్సిడెంట్లు, గాయాలు వంటివి కూడా కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు శివలింగానికి గంగాజలం, పాలు సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

2.మేష రాశి:

మేష రాశి వారికి ఈ యోగం వలన నష్టాలు కలిగే అవకాశం ఉంది. చిన్నపాటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొన్ని రోజులు ఆగి ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడం మంచిది. అపార్థాల వలన ఆర్గ్యుమెంట్లు పెరుగుతాయి. "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో ఇబ్బందులు కలగవచ్చు. ఈ యోగం వలన ఈ రాశి వారికి నష్టాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారు అనవసరంగా ఆర్గ్యుమెంట్లు చేయకుండా చూసుకోవాలి. వాహనాలను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని, హనుమాన్ చాలీసాను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

4.ధనస్సు రాశి:

యోగం వలన ధనస్సు రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసాను చదువుకుంటే మంచిది. శివుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More