అష్టలక్ష్మీ స్తోత్రాన్ని చదివితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భక్తితో అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక ధైర్యం కలుగుతుంది.

అష్టలక్ష్మీ దేవి ఎనిమిది రూపాలను స్మరించుకుంటూ ఈ స్తోత్రాన్ని ఈ రోజు వరలక్ష్మీ వ్రతం వల్ల చదవడం వలన పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఐశ్వర్యం, ఏకాగ్రత కలుగుతాయి. కుటుంబ శ్రేయస్సు, కృతజ్ఞతా భావం పెరుగుతాయి. మనిషి ఆలోచనలను కూడా పెంపొందించుకోవచ్చు.
అష్టలక్ష్మీ స్తోత్రం
సుమనస వందిత సుందరి మాధవి
చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయిని
మంజుల భాషిణి వేదనుతే..
పంకజవాసిని దేవ సుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి సదా పాలయ మామ్..
అయికలి కల్మష నాశిని కామిని
వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి
మంత్ర నివాసిని మంత్రనుతే..
మంగళదాయిని అంబుజవాసిని
దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని
ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్..
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి
మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద
జ్ఞాన వికాసిని శాస్త్రనుతే..
భవభయ హారిణి పాపవిమోచని
సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని
ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్..
జయ జయ దుర్గతి నాశిని కామిని
సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాతి సమావృత
పరిజన మండిత లోకనుతే..
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత
తాప నివారిణి పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని
గజలక్ష్మి రూపేణ పాలయ మామ్..
అయి ఖగవాహిని మోహిని చక్రిణి
రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణ వారిధి లోకహితైషిణి
స్వరసప్త భూషిత గాననుతే..
{{/usCountry}}స్వరసప్త భూషిత గాననుతే..
{{/usCountry}}సకల సురాసుర దేవ మునీశ్వర
మానవ వందిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని
సంతానలక్ష్మి సదా పాలయ మామ్..
జయ కమలాసిని సద్గతిదాయిని
జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర
భూషిత వాసిత వాద్యనుతే..
కనకధారాస్తుతి వైభవ వందిత
శంకర దేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదన కామిని
విజయలక్ష్మి సదా పాలయ మామ్..
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి
శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ
శాంతి సమావృత హాస్యముఖే..
నవనిధి దాయిని కలిమలహారిణి
కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదన కామిని
విద్యాలక్ష్మి సదా పాలయ మామ్..
ధిమిధిమి ధింధిమి ధింధిమి దుందుభి
నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద
సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత
వైదిక మార్గప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదన కామిని
ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్..