వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అష్టలక్ష్మీ స్తోత్రం పఠించండి.. ఈ ప్రయోజనాలు పొందండి!

అష్టలక్ష్మీ స్తోత్రం లక్ష్మీదేవి ఎనిమిది రూపాలను స్తుతించే భక్తి స్తోత్రంగా భావిస్తారు. భక్తితో పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి, ఆధ్యాత్మిక ధైర్యం, ఏకాగ్రత, కృతజ్ఞతా భావం వంటి సానుకూల భావనలు పెంపొందుతాయని భక్తుల నమ్మకం. 

Published on: Aug 21, 2026, 08:00:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అష్టలక్ష్మీ స్తోత్రాన్ని చదివితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భక్తితో అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక ధైర్యం కలుగుతుంది.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అష్టలక్ష్మీ స్తోత్రం పఠించండి.. ఈ ప్రయోజనాలు పొందండి! (pinterest)
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అష్టలక్ష్మీ స్తోత్రం పఠించండి.. ఈ ప్రయోజనాలు పొందండి! (pinterest)

అష్టలక్ష్మీ దేవి ఎనిమిది రూపాలను స్మరించుకుంటూ ఈ స్తోత్రాన్ని ఈ రోజు వరలక్ష్మీ వ్రతం వల్ల చదవడం వలన పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఐశ్వర్యం, ఏకాగ్రత కలుగుతాయి. కుటుంబ శ్రేయస్సు, కృతజ్ఞతా భావం పెరుగుతాయి. మనిషి ఆలోచనలను కూడా పెంపొందించుకోవచ్చు.

అష్టలక్ష్మీ స్తోత్రం

సుమనస వందిత సుందరి మాధవి

చంద్ర సహోదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయిని

మంజుల భాషిణి వేదనుతే..

పంకజవాసిని దేవ సుపూజిత

సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయ హే మధుసూదన కామిని

ఆదిలక్ష్మి సదా పాలయ మామ్..

అయికలి కల్మష నాశిని కామిని

వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి

మంత్ర నివాసిని మంత్రనుతే..

మంగళదాయిని అంబుజవాసిని

దేవగణాశ్రిత పాదయుతే

జయ జయ హే మధుసూదన కామిని

ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్..

జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి

మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద

జ్ఞాన వికాసిని శాస్త్రనుతే..

భవభయ హారిణి పాపవిమోచని

సాధుజనాశ్రిత పాదయుతే

జయ జయ హే మధుసూదన కామిని

ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్..

జయ జయ దుర్గతి నాశిని కామిని

సర్వఫలప్రద శాస్త్రమయే

రథగజ తురగపదాతి సమావృత

పరిజన మండిత లోకనుతే..

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత

తాప నివారిణి పాదయుతే

జయ జయ హే మధుసూదన కామిని

గజలక్ష్మి రూపేణ పాలయ మామ్..

అయి ఖగవాహిని మోహిని చక్రిణి

రాగవివర్ధిని జ్ఞానమయే

గుణగణ వారిధి లోకహితైషిణి

స్వరసప్త భూషిత గాననుతే..

సకల సురాసుర దేవ మునీశ్వర

మానవ వందిత పాదయుతే

జయ జయ హే మధుసూదన కామిని

సంతానలక్ష్మి సదా పాలయ మామ్..

జయ కమలాసిని సద్గతిదాయిని

జ్ఞానవికాసిని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర

భూషిత వాసిత వాద్యనుతే..

కనకధారాస్తుతి వైభవ వందిత

శంకర దేశిక మాన్యపదే

జయ జయ హే మధుసూదన కామిని

విజయలక్ష్మి సదా పాలయ మామ్..

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి

శోక వినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణవిభూషణ

శాంతి సమావృత హాస్యముఖే..

నవనిధి దాయిని కలిమలహారిణి

కామిత ఫలప్రద హస్తయుతే

జయ జయ హే మధుసూదన కామిని

విద్యాలక్ష్మి సదా పాలయ మామ్..

ధిమిధిమి ధింధిమి ధింధిమి దుందుభి

నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద

సువాద్యనుతే

వేదపురాణేతిహాస సుపూజిత

వైదిక మార్గప్రదర్శయుతే

జయ జయ హే మధుసూదన కామిని

ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More