ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము. తెలుగు సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ నెలంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటుంది.

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. ఆ రోజే భక్తులు ఎంతో నిష్ఠతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు కలిగించే వరలక్ష్మీ దేవిని కొలిస్తే ఇళ్లల్లో సుభిక్షం వెల్లివిరుస్తుందని నమ్మకం.
వరలక్ష్మీ వ్రతం విశేషత:
పురాణాల ప్రకారం చూసినట్లయితే, పార్వతీదేవి కోరిక మేరకు శివుడు లోక కళ్యాణం కోసం మహిళలందరికీ సౌభాగ్యాన్ని, సిరి సంపదలను కలిగించే ఈ వ్రత విధానాన్ని చెప్పడం జరిగింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన మహాలక్ష్మి ఈ వరలక్ష్మీ రూపమని శాస్త్రాలు అంటున్నాయి.
‘వర’ అని పేరులోనే ఉంది కాబట్టి, కోరికలు తీర్చే దేవతగా భక్తులు వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. పెళ్లికాని యువతులు మంచి భర్త కలగాలని, వివాహితులు కుటుంబం సుభిక్షంగా ఉండాలని, భర్త దీర్ఘాయువు కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రత విధానం:
వ్రతం కోసం మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి, తలస్నానం చేసి, పట్టు వస్త్రాలు కట్టుకుని పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి. పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై బియ్యం పోసి, దానిపై రాగి లేదా ఇత్తడి చెంబులో నీళ్లు, పసుపు, కుంకుమ వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత కలశం పై మామిడి ఆకుల్ని, కొబ్బరికాయకు పసుపు రాసి అందంగా కలశంపై పెట్టాలి. కొబ్బరికాయ పైన చుట్టిన జాకెట్ ముక్క చుట్టి, గాజులు వేసి అందంగా పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా వెండి, మట్టి ప్రతిమను అందంగా అలంకరించుకోవాలి. షోడశోపచారాలతో వరలక్ష్మీదేవిని పూజించాలి.
అమ్మవారికి అత్యంత ఇష్టమైన తొమ్మిది రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. పరమాన్నం, అప్పాలు, బూరెలు, గారెలు, శెనగలు, పులిహోర ఇలా నైవేద్యాలను సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ముత్తైదువులకు తాంబూలం, జాకెట్ ముక్క, దక్షిణతో పాటు వాయనం ఇవ్వడం ఆచారం. కుడి చేతికి తోరం కట్టుకోవాలి.
{{/usCountry}}అమ్మవారికి అత్యంత ఇష్టమైన తొమ్మిది రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. పరమాన్నం, అప్పాలు, బూరెలు, గారెలు, శెనగలు, పులిహోర ఇలా నైవేద్యాలను సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ముత్తైదువులకు తాంబూలం, జాకెట్ ముక్క, దక్షిణతో పాటు వాయనం ఇవ్వడం ఆచారం. కుడి చేతికి తోరం కట్టుకోవాలి.
{{/usCountry}}ఇలానే నియమ నిష్ఠలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మీ కటాక్షం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.