వరలక్ష్మీ వ్రతం 2026.. పూజా ముహూర్తం, విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ ముహూర్తాల్లో పూజిస్తే శుభ ఫలితాలు!

వరలక్ష్మీ వ్రతం 2026: శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం 2026లో ఆగస్టు 21న జరుపుకోనున్నారు. వివాహిత మహిళలు కుటుంబ సుఖసంతోషాలు, సిరిసంపదలు, అష్టైశ్వర్యాల కోసం వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 

Published on: Aug 12, 2026, 14:00:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో పవిత్రత ఉంటుంది. శుక్రవారాల నాడు ఆ తల్లి అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అలా పూజిస్తే కుటుంబంలో సిరిసంపదలు వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ వివాహిత మహిళలు ఈ నోమును ఆచరిస్తారు.

వరలక్ష్మీ వ్రతం 2026.. పూజా ముహూర్తం, విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ ముహూర్తాల్లో పూజిస్తే శుభఫలితాలు! (pinterest)
వరలక్ష్మీ వ్రతం 2026.. పూజా ముహూర్తం, విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ ముహూర్తాల్లో పూజిస్తే శుభఫలితాలు! (pinterest)

ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ వ్రతం. కేవలం సాధారణ వ్రతంలా కాకుండా, ఈసారి ఎన్నో అరుదైన ఖగోళ సంయోగాలు ఈ పండుగ రోజున ఏర్పడుతుండటం విశేషం.

పూజా ముహూర్తాలు - ప్రాధాన్యత

ఏ పండగైనా, వ్రతమైనా సరైన ముహూర్తంలో ఆచరిస్తేనే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున స్థిర లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది.

ముఖ్యంగా సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, కుంభ లగ్నం మరియు వృషభ లగ్న సమయాలు పూజకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆయా ప్రాంతాలలోని స్థానిక పంచాగం ప్రకారం సరిగ్గా ముహూర్తం చూసుకుని కలశ స్థాపన చేయడం వల్ల అష్టలక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

పూజా విధానం మరియు చేయాల్సిన నియమాలు

  • వ్రతం రోజున ఉదయాన్నే త్వరగా లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసి, మామిడి తోరణాలు, అరటి చెట్లతో సుందరంగా అలంకరించాలి.
  • పీటపై కలశాన్ని ఏర్పాటు చేసి, వరలక్ష్మీదేవి ప్రతిమను లేదా ఫొటోను ప్రతిష్టించి భక్తితో పూజించాలి.
  • అమ్మవారికి ఇష్టమైన నివేదనలు, ఫలాలు, తాంబూలం సమర్పించాలి. రోజంతా ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకుంటూ, సాయంత్రం వేళ అమ్మవారికి నీరాజనం సమర్పించి వ్రత కథను పఠించాలి.
  • ఈ విధంగా నిష్టతో పూజ చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ఆరోగ్యం మరియు కుటుంబ సౌభాగ్యం

మహాలక్ష్మి కటాక్షం ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కుటుంబంలో అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న అడ్డంకులు, ఆర్థిక సమస్యలు మాయమై మనశ్శాంతి లభిస్తుంది.

భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మీ వ్రతం దీపావళి పూజతో సమానమైన ఫలితాలను ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఆగస్టు 21న వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాండి.

ఆగసులోనే శ్రావణ పౌర్ణమి

శ్రావణ పూర్ణిమ కూడా ఇదే నెలలో రావడంతో ఈ నెలలో పండుగ శోభ మరింత పెరిగింది. పౌర్ణమి నాడు పవిత్ర నదీ స్నానాలు ఆచరించడం, దాన ధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు.

అంతేకాకుండా ఇదే రోజున శ్రావణ ఉపకర్మ, కొత్త జంధ్యం ధారణ, రుషి తర్పణాలు వంటి వైదిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను కూడా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More