రేపే శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం.. ఇలా పూజ చేస్తే అఖండ సౌభాగ్యం!

శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని భక్తుల విశ్వాసం. ఈ రోజున మంగళ గౌరీ దేవి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల అఖండ సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖ శాంతులు కలుగుతాయని నమ్ముతారు.  

Published on: Aug 17, 2026, 12:31:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా విశేషమైనవి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆ రోజు మంగళ గౌరీ దేవి వ్రతం ఆచరించడం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది. శ్రావణ మాసం అంతా శివనామస్మరణతో పాటు అమ్మవారి పూజలతో కళకళ్లాడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి విశేష స్థానం ఉంది.

రేపే శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం.. ఇలా పూజ చేస్తే అఖండ సౌభాగ్యం! (pinterest)
రేపే శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం.. ఇలా పూజ చేస్తే అఖండ సౌభాగ్యం! (pinterest)

ఆ రోజు భక్తులు, ముఖ్యంగా వివాహిత స్త్రీలు, మంగళ గౌరీ వ్రతం ఆచరించి, అష్టోత్తరాలతో పసుపు, కుంకుమలు సమర్పిస్తూ అమ్మవారిని కొలిస్తే సకల పాపాలు తొలగిపోయి ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి.

శ్రావణ మంగళవారం మంగళ గౌరీ దేవి వ్రతం ఎందుకు ఆచరించాలి?

శ్రావణ మంగళవారం నాడు భక్తులతో మంగళ గౌరీ దేవిని ఆరాధించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. పెళ్లయిన కొత్తలో ఐదేళ్లపాటు ఈ వ్రతాన్ని ఆచరించడం అయితే, ఎవరైనా కుటుంబ శ్రేయస్సు కోసం, సంతాన సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని భక్తులతో చేయొచ్చు.

రోజు తెల్లవారుజామున తల స్నానం చేయాలి. ముందు రోజే తల రుద్దుకుని, ఆరోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. తల రుద్దుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకుని, పూజ మందిరాన్ని కూడా అలంకరించుకోవాలి.

పూజా విధానం

పూజ మందిరంలో ఒక పీట వేసి, దానిపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని వేసి, ఆ పీఠంపై అమ్మవారి ప్రతిమను పెట్టి అలంకరించాలి.

కలశంలో నీళ్లు పోసి, మామిడి ఆకులు, కొబ్బరి కాయలతో అలంకరించాలి.

అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేయాలి.

పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, అక్షింతలు సమర్పించి, చివరిగా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాన్ని కూడా సమర్పించాలి.

దీపారాధన చేస్తే చాలా మంచిది. అమ్మవారి అష్టోత్తరం పఠిస్తూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. పూజ పూర్తయ్యాక ముత్తైదువులకే తాంబూలం ఇవ్వాలి.

ఈ వ్రతాన్ని ఇలా ఆచరించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే సాయంత్రం మళ్లీ దీపారాధన స్వీకరించాలి.

ఈ వ్రతం వలన కలిగే లాభాలు

ఇలా శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వలన వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. భర్త ఆయురారోగ్యాలతో ఉంటారు. కుటుంబంలో సుఖ శాంతులు ఏర్పడతాయి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం పాటిస్తే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More