చాణక్య నీతి ప్రకారం.. ఈ 5 లక్షణాలున్న పురుషుల పట్ల స్త్రీలు సులభంగా ఆకర్షితులవుతారు!
చాణక్యనీతి ప్రకారం కొన్ని గుణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఇష్టపడుతుంటారు. వారితో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటారు. పురుషుల్లో స్త్రీలు ఇష్డపడే 5 లక్షణాలు ఏంటో చూడండి.
ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామికి కొన్ని మంచి గుణాలు ఉండాలని ఆశిస్తుంది. అటువంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి తన జీవితాంతం తనతో ఉండాలని కోరుకుంటుంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో పురుషుని స్వభావం, గుణగణాలు, దుర్గుణాల గురించి విస్తృతంగా చెప్పాడు. అదే సమయంలో స్త్రీలు ఇష్టపడే పురుషుల గుణాలను కూడా ఆయన వర్ణించాడు. చాణక్యుని సలహా ప్రకారం.. పురుషులను గొప్పవారిగా చేసే కొన్ని గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఉన్న పురుషుల పట్ల స్త్రీలు సహజంగానే ఆకర్షితులవుతారు. స్త్రీలు పురుషులలోని కొన్ని లక్షణాలను లేదా గుణాలను నిజంగా ఇష్టపడతారు. స్త్రీలు అలాంటి పురుషులను పొందాలని కూడా కోరుకుంటారు. ఆ 5 గుణాలు ఏంటో చూడండి.

నిజాయితీ
నిజాయితీ అనేది ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిన ఒక అవసరమైన గుణం. సంబంధాలలో నిజాయితీగా ఉండేవారికి గౌరవం ఎల్లప్పుడూ లభిస్తుందని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలను గౌరవప్రదమైన ఉద్దేశాలతో సంప్రదించే పురుషులు తమ భాగస్వాములను ఎన్నడూ మోసం చేయరు. పురుషులలోని ఈ గుణం స్త్రీలకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అటువంటి పురుషులు తమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తారు. తమ సంబంధానికి ఎన్నడూ ద్రోహం చేయరు.
క్రమశిక్షణ
మంచి నడవడిక, మధురమైన మాటలు, సౌమ్యమైన ప్రవర్తన వంటి లక్షణాలను మహిళలు పురుషులలో కోరుకుంటారు. ఈ లక్షణాలున్న పురుషులు మహిళలను సులభంగా ఆకర్షిస్తారు. ఇలాంటి లక్షణాలున్న పురుషులు తమ మధురమైన మాటలతో ఇతరుల మనసులను గెలుచుకుంటారు. ఈ లక్షణాలు మహిళలకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పురుషులు ఇతరులతో ప్రవర్తించే తీరును మహిళలు ఎల్లప్పుడూ చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు.
వినే సామర్థ్యం
ప్రతి స్త్రీ తన భర్త నీడలా ఎల్లప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. తమ అవసరాలను వినే వ్యక్తి కావాలని వారు కోరుకుంటారు. వారికి మాట్లాడే సామర్థ్యం ఉంటే, వినే ధైర్యం కూడా ఉండాలి. స్త్రీలు దీనిని ఒక మంచి పురుషుడి లక్షణంగా భావిస్తారు. స్త్రీలు చెప్పేది విని, వారి మాటలను నిర్లక్ష్యం చేయని పురుషుడినే ఎల్లప్పుడూ కోరుకుంటారు.
భద్రత
తనకు భద్రతను కల్పించే పురుషులను ఏ స్త్రీ అయినా ప్రేమిస్తుంది. స్త్రీలు భద్రతను అందించే పురుషులను ప్రేమిస్తారు. ఒక స్త్రీ ఒక పురుషునితో సురక్షితంగా ఉన్నట్లు భావించినప్పుడు, ఆమె ఆ పురుషుడిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తుంది.
గౌరవం
చాణక్యుడి ప్రకారం.. ఇతరులను గౌరవించడం తెలిసిన పురుషుల పట్ల స్త్రీలు సులభంగా ఆకర్షితులవుతారు. అది ప్రేమ సంబంధం అయినా, వివాహం అయినా, ఎవరినీ గౌరవించకుండా ఇతరులను బాధపెట్టే పురుషులను స్త్రీలు ఎన్నటికీ ఇష్టపడరు. స్త్రీలు పురుషుడి నుండి ఆశించే అతిపెద్ద విషయం సమానత్వం. ఈ విషయం కత్చితంగా ప్రతీ ఒక్క పురుషుడు గుర్తుపెట్టుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


