వరలక్ష్మీ వ్రతం విశేషత ఇదే.. సౌభాగ్యం, అష్టైశ్వర్యాల కోసం మహిళలు చేసే పవిత్ర వ్రతం!

తెలుగు సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. వరలక్ష్మీ దేవిని పూజించడం ద్వారా సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు, కుటుంబ సుభిక్షం కలుగుతాయని భక్తుల విశ్వాసం.  

Published on: Aug 18, 2026, 14:00:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము. తెలుగు సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ నెలంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటుంది.

వరలక్ష్మీ వ్రతం విశేషత ఇదే.. సౌభాగ్యం, అష్టైశ్వర్యాల కోసం మహిళలు చేసే పవిత్ర వ్రతం! (pinterest)
వరలక్ష్మీ వ్రతం విశేషత ఇదే.. సౌభాగ్యం, అష్టైశ్వర్యాల కోసం మహిళలు చేసే పవిత్ర వ్రతం! (pinterest)

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. ఆ రోజే భక్తులు ఎంతో నిష్ఠతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు కలిగించే వరలక్ష్మీ దేవిని కొలిస్తే ఇళ్లల్లో సుభిక్షం వెల్లివిరుస్తుందని నమ్మకం.

వరలక్ష్మీ వ్రతం విశేషత:

పురాణాల ప్రకారం చూసినట్లయితే, పార్వతీదేవి కోరిక మేరకు శివుడు లోక కళ్యాణం కోసం మహిళలందరికీ సౌభాగ్యాన్ని, సిరి సంపదలను కలిగించే ఈ వ్రత విధానాన్ని చెప్పడం జరిగింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన మహాలక్ష్మి ఈ వరలక్ష్మీ రూపమని శాస్త్రాలు అంటున్నాయి.

‘వర’ అని పేరులోనే ఉంది కాబట్టి, కోరికలు తీర్చే దేవతగా భక్తులు వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. పెళ్లికాని యువతులు మంచి భర్త కలగాలని, వివాహితులు కుటుంబం సుభిక్షంగా ఉండాలని, భర్త దీర్ఘాయువు కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

వరలక్ష్మీ వ్రత విధానం:

వ్రతం కోసం మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి, తలస్నానం చేసి, పట్టు వస్త్రాలు కట్టుకుని పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి. పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై బియ్యం పోసి, దానిపై రాగి లేదా ఇత్తడి చెంబులో నీళ్లు, పసుపు, కుంకుమ వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

ఆ తర్వాత కలశం పై మామిడి ఆకుల్ని, కొబ్బరికాయకు పసుపు రాసి అందంగా కలశంపై పెట్టాలి. కొబ్బరికాయ పైన చుట్టిన జాకెట్ ముక్క చుట్టి, గాజులు వేసి అందంగా పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా వెండి, మట్టి ప్రతిమను అందంగా అలంకరించుకోవాలి. షోడశోపచారాలతో వరలక్ష్మీదేవిని పూజించాలి.

అమ్మవారికి అత్యంత ఇష్టమైన తొమ్మిది రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. పరమాన్నం, అప్పాలు, బూరెలు, గారెలు, శెనగలు, పులిహోర ఇలా నైవేద్యాలను సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ముత్తైదువులకు తాంబూలం, జాకెట్ ముక్క, దక్షిణతో పాటు వాయనం ఇవ్వడం ఆచారం. కుడి చేతికి తోరం కట్టుకోవాలి.

ఇలానే నియమ నిష్ఠలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మీ కటాక్షం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More