వరూధిని అంటే రక్షణ కవచం అని అర్థం. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులను విష్ణుమూర్తి అన్ని ఆపదల నుండి రక్షిస్తాడని నమ్మకం. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ ఏకాదశి ప్రాముఖ్యతను పాండవులకు వివరించారు. ఈ రోజున భక్తితో పూజించే వారికి మోక్షం లభించడమే కాకుండా, అకాల మరణ భయం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
పూజా విధానం: ఇలా చేస్తే అక్షయ పుణ్యం మీ సొంతం

వరూధిని ఏకాదశి రోజున సరైన పద్ధతిలో పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు దక్కుతాయి.
వేకువజామున స్నానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.
సంకల్పం: పూజా గదిని శుభ్రం చేసి, ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరచి విష్ణుమూర్తి పటాన్ని ప్రతిష్టించాలి. భగవంతుని ముందు దీపం వెలిగించి వ్రత సంకల్పం చేయాలి.
అభిషేకం: దక్షిణావర్తి శంఖంతో స్వామివారికి అభిషేకం చేయడం శుభప్రదం. కుంకుమపువ్వు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.
నైవేద్యం: ఈ ఏకాదశి రోజున స్వామివారికి పసుపు రంగులో వుండే నైవేద్యంగా సమర్పించడం చాలా ప్రత్యేకం. నైవేద్యంలో తప్పనిసరిగా తులసి దళం ఉంచాలి.
పారాయణం: విష్ణు సహస్రనామ పారాయణం, ఏకాదశి వ్రత కథ చదవడం లేదా వినడం చేయాలి.
శక్తివంతమైన మంత్రాల జపం
పూజ సమయంలో ఈ క్రింది మంత్రాలను జపించడం వల్ల మనోకామ్యాలు నెరవేరుతాయి:
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ విష్ణవే చ విద్మహే వాసుదేవాయ ధీమహి.. తన్నో విష్ణుః ప్రచోదయాత్
లక్ష్మీ మంత్రం: ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః
ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు
ఈ పవిత్ర రోజున దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, ధాన్యం, భోజనం, పాదరక్షలు, గొడుగు, నీటి పాత్రలు (కుండలు), మరియు పసుపును పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
ముఖ్యంగా గమనించాల్సిన నియమాలు
{{/usCountry}}ఈ పవిత్ర రోజున దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, ధాన్యం, భోజనం, పాదరక్షలు, గొడుగు, నీటి పాత్రలు (కుండలు), మరియు పసుపును పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
ముఖ్యంగా గమనించాల్సిన నియమాలు
{{/usCountry}}దశమి నుండే నియమం: ఏకాదశి నియమాలు దశమి రాత్రి నుండే ప్రారంభమవుతాయి.
నియమ నిష్టలు: ఇతరులను దూషించడం, అబద్ధాలు ఆడటం చేయరాదు. మనసును ప్రశాంతంగా, ఆధ్యాత్మిక చింతనతో ఉంచుకోవాలి.
జాగరణ: ఏకాదశి నాటి రాత్రి భజన కీర్తనలతో జాగరణ చేయడం వల్ల కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని శాస్త్రవచనం.