Varuthini Ekadashi Remedies: వరూధిని ఏకాదశి నాడు విష్ణువు అనుగ్రహం కలగాలంటే.. 12 రాశుల వారు ఏం చెయ్యాలో తెలుసుకోండి
Varuthini Ekadashi Remedies: వరూధిని ఏకాదశి నాడు విష్ణు అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వీటిని పాటించండి. 12 రాశుల వారు విష్ణువుకి వేటిని నైవేద్యంగా సమర్పించాలో ఇక్కడ తెలుసుకోవచ్చు, ఇలా చేయడం వలన విష్ణువు అనుగ్రహంతో దేనికి లోటు ఉండదు, సంతోషంగా ఉండొచ్చు.
ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఏప్రిల్ 13, సోమవారం నాడు వరూధిని ఏకాదశి రానుంది. వరూధిని ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించి ఉపవాసం ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. వరూధిని ఏకాదశి వేళా విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండాలంటే, మీ రాశి ప్రకారం ఈ ఆహార పదార్థాలను విష్ణువుకి నైవేద్యంగా (Varuthini Ekadashi Remedies) సమర్పించండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ విష్ణువు మీ కోరికలు తీరుస్తాడు. మరి వరూధిని ఏకాదశి నాడు 12 రాశుల వారు ఏవీ నైవేద్యంగా పెట్టాలో తెలుసుకోండి.

వరూధిని ఏకాదశి నాడు 12 రాశుల వారు ఏం చెయ్యాలి?
మేష రాశి:
మేష రాశి వారు వరూధిని ఏకాదశి వేళా విష్ణు అనుగ్రహం కలగడానికి ఎరుపు రంగులో ఉండే స్వీట్లు, బూందీ లడ్డూలను నైవేద్యంగా పెడితే మంచిది. దీంతో సంతోషం, సంపద పెరుగుతాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారు విష్ణువుని ఆరాధించే పంచామృతాలను సమర్పించండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచదారను పంచామృతాలు అంటారు. వీటిని సమర్పించడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
మిధున రాశి:
మిధున రాశి వారు పెసరపప్పుతో చేసిన హల్వాను విష్ణువుకి సమర్పించండి. ఇది వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది, మాటల మాధుర్యాన్ని పెంచుతుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు విష్ణువుకి పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా పెడితే మంచిది. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి, మానసిక ప్రశాంతత ఉంటుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు బెల్లంతో చేసిన స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారు పాలతో చేసిన ఆహార పదార్థాలను విష్ణువుకి నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సంతోషంగా ఉండొచ్చు, కోరికలు నెరవేరుతాయి.
తులా రాశి:
తులా రాశి వారు తెలుపు రంగులో ఉండే స్వీట్లు నైవేద్యంగా సమర్పించడం వలన మంచి జరుగుతుంది. శుభ ఫలితాలను చూస్తారు, జీవితంలో ఆనందం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు బెల్లంతో చేసిన పాయసం లేదా స్వీట్లు నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందంగా ఉంటారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు లడ్డూలు, పసుపు రంగులో ఉండే పండ్లు వంటివి నైవేద్యంగా పెడితే మంచిది. అదృష్టం పెరుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు.
మకర రాశి:
మకర రాశి వారు లడ్డూలు, పాలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. సంతోషంగా ఉండొచ్చు.
కుంభ రాశి:
కుంభ రాశి వారు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా పెడితే మంచి జరుగుతుంది. సంపద పెరుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు.
మీన రాశి:
మీన రాశి వారు పటిక బెల్లం, బూందీ లడ్డూలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. విష్ణువు అనుగ్రహంతో సంతోషం రెట్టింపు అవుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












