...
...
Next Story

Dining Table Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్ పై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి!

వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్ పై కొన్ని వస్తువులను పెట్టకూడదు. వాటి వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. డైనింగ్ టేబుల్ విషయంలో ఈ పొరపాట్లు చేయడం వలన కుటుంబంలో టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Published on: Feb 16, 2026, 15:00:38 IST
Advertisement

ఇంటిని నిర్మించేటప్పుడు మొదలు, ఇంట్లో సామాన్లను పెట్టుకునే వరకు చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం వలన అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. పైగా వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండొచ్చు. చాలా మంది ఇంట్లో ఉండే ప్రతి గదిలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. డైనింగ్ టేబుల్ విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించడం మంచిది.

డైనింగ్ టేబుల్ వాస్తు నియమాలు

Dining Table Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్ పై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి (pinterest)
Dining Table Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్ పై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి (pinterest)

వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్ పై కొన్ని వస్తువులను పెట్టకూడదు. వాటి వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. డైనింగ్ టేబుల్ విషయంలో ఈ పొరపాట్లు చేయడం వలన కుటుంబంలో టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ పై వీటిని పెట్టకండి

వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ పై కొన్ని వస్తువులను పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా మందులను డైనింగ్ టేబుల్ పై పెట్టకూడదు. టాబ్లెట్లు, మందులు వంటివి పెట్టడం వలన సమస్యలు వస్తాయి. ప్రతికూల ప్రభావంతో బాధపడాల్సి ఉంటుంది. అలాగే చాలామంది డైనింగ్ టేబుల్ పై ఉప్పును పెడుతూ ఉంటారు.

వీటిని పెట్టడం వలన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కొంత మంది డైనింగ్ టేబుల్ పై పర్స్, ఫోన్ వంటివి పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా పెట్టడం కూడా మంచిది కాదు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండొచ్చు. కాబట్టి ఈ తప్పులను చేయకండి.

వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ ఎటు ఉండాలి?

డైనింగ్ టేబుల్ పై ఎప్పుడూ పాడైపోయిన ఆహారం పెట్టకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనింగ్ టేబుల్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. చెక్క టేబుల్ అయితే మరీ మంచిది.

అలాగే డైనింగ్ టేబుల్ పై విరిగిపోయిన పాత్రలు, పాడైపోయినవి పెట్టకూడదు. పనికిరాని వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించండం మంచిది. ఇలా ఈ నియమాలను పాటిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగా వుండచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks