Vastu Shastra: వేసవిలో ఈ దిశలో మట్టి కుండను పెడితే జీవితమే మారిపోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది!
Vastu Shastra: చాలా మంది ఇళ్లల్లో మట్టి కుండలను పెడుతూ ఉంటారు. మట్టికుండను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన దిశలో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. వేసవిలో ఈ దిశలో మట్టికుండను పెడితే అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. అలాగే సంపద పెరగడానికి ఈ చిట్కాలు కూడా పాటించండి.
ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే ఉపశమనంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిది. మట్టి కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. వేడి నుంచి వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు. అంతేకాదు, మట్టితో చేసిన కుండను ఇంట్లో పెడితే సానుకూల శక్తి కూడా ఉంటుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వేసవికి మీరు కూడా మట్టి కుండను కొనాలని అనుకుంటున్నారా? అయితే ఏ దిశలో పెట్టాలో కూడా తెలుసుకోండి.

మట్టి కుండ వలన కలిగే లాభాలు? వాస్తు ప్రకారం మట్టి కుండ ఏ దిశలో ఉండాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. అయితే సరైన దిశలో పెడితే శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది. లేకపోతే సమస్యలు వస్తాయి. మట్టి కుండ ఇంట్లో ఉంటే మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. సరైన దిశలో మట్టి కుండను పెడితే ఇంట్లో శక్తి సమతుల్యంగా ఉంటుంది. మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. మట్టి కుండను పూజ గదిలో పెడితే ఇంటి మొత్తం సానుకూల శక్తితో నిండిపోతుంది. మట్టి కుండ ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు కూడా రావు. చాలా రకాల వ్యాధుల నుంచి ఇది రక్షణ అందిస్తుంది. మట్టి కుండను ఇంట్లో ఉంచడం వలన ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధం దృఢంగా మారుతుంది. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.
ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంచండి:
మట్టి కుండను ఎప్పుడు ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఉత్తరం కుబేరుడి దిశగా భావిస్తారు. ఆ దిశలో మట్టి కుండ ఉంటే ధన ప్రవాహానికి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అయితే మట్టి కుండను ఇంట్లో పెట్టినప్పుడు కుండ ఖాళీగా లేకుండా చూసుకోండి. ఎప్పుడూ నిండుగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఉంచడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
మట్టి కుండ దగ్గర సాయంత్రం పూట ఒక దీపం పెట్టండి. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. మట్టి కుండ విషయంలో చిన్న పొరపాటు కూడా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా విరిగిపోయిన, పగిలిపోయిన కుండలను ఇంట్లో పెట్టకూడదు. అవి ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. కానీ మట్టి కుండను నిండుగా, ఇక్కడ చెప్పిన దిశల్లో ఉంచినట్లయితే సిరి సంపదలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అదృష్టం కూడా పెరుగుతుంది.
ఇంట్లో సంపద పెరగడానికి ఈ చిట్కాలను కూడా పాటించండి:
1.తులసి మొక్క:
ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని సమర్పించి, తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది సానుకూల శక్తిని తీసుకొస్తుంది. మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది.
2.అనవసరమైన వస్తువులను తొలగించండి:
ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించండి. పనికిరాని సామాన్లు సానుకూల శక్తికి అడ్డుపడతాయి. అలాంటి వాటిని తొలగిస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఆనందంగా ఉండొచ్చు.
3.మనీ ప్లాంట్ పెట్టండి:
ఇంట్లో ఒక మనీ ప్లాంట్ పెట్టండి. ఇది కూడా సానుకూల శక్తిని కలిగేలా చేస్తుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత, కెరీర్‌లో ఊహించిన మార్పులు చూడొచ్చు.
4.ముఖద్వారం:
ఇంటి ముఖద్వారం దగ్గర ప్రతి రోజు నీళ్లు జల్లి శుభ్రం చేయండి. ఇది సానుకూల శక్తిని పెంచి, ప్రతికూల శక్తిని తొలగించేలా చేస్తుంది. అలాగే ఒక రాగి పాత్రలో నీటిని నింపి ముఖద్వారం వద్ద ఉంచండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


