వాస్తు ప్రకారం ల్యాప్‌టాప్ వాల్‌పేపర్ ఎలా ఉండాలి? కెరీర్ విజయానికి ఈ శుభప్రదమైన చిత్రాలను ఉపయోగించండి!
నేటి డిజిటల్ యుగంలో ల్యాప్‌టాప్ కేవలం ఒక పరికరం మాత్రమే కాదు, వృత్తి జీవితంలో విడదీయలేని భాగం. నిత్యం మనం చూసే ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉండే చిత్రాలు మన మనస్సుపై బలమైన ముద్ర వేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కెరీర్‌లో ఎదుగుదల, మానసిక ఉల్లాసం కోసం ఎలాంటి వాల్‌పేపర్లు పెట్టుకోవాలో తెలుసుకుందాం.
ఈరోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ల్యాప్‌టాప్ ఉంటుంది. ల్యాప్‌టాప్ ఒక ఎలక్ట్రానిక్ పరికరమే కాదు, వృత్తిపరమైన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. వాస్తు ప్రకారం, ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై కనిపించే చిత్రాలు మన మానసిక శక్తి, ఆలోచనా విధానంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. సానుకూలతను, ప్రేరణను కలిగించే వాల్‌పేపర్లు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. అలాగే, అవి కెరీర్‌లో విజయాలు, కొత్త అవకాశాలను తీసుకు రావడానికి కూడా సాయపడతాయి.

ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కోరుకున్నట్లయితే, ఈ శుభప్రదమైన చిత్రాలను పెట్టుకోండి. మీకు సానుకూల మార్పులు వస్తాయి. అలాగే కెరీర్‌లో కూడా మంచి అవకాశాలు వస్తాయి.
ఈ వాల్‌పేపర్లతో అనేక మార్పులు వస్తాయి
ఏడు పరుగెత్తుతున్న గుర్రాలు
వాస్తు ప్రకారం, పరిగెడుతున్న ఏడు గుర్రాల ఫోటో చాలా శక్తివంతమైనది. విజయం, పురోగతి, సానుకూల శక్తికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ ఫోటోను కనక ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై పెట్టినట్లయితే, కెరీర్‌లో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
పచ్చని ప్రకృతి దృశ్యాలు
పచ్చని చెట్లు, మొక్కలు, ప్రకృతి అందాలు కలిగిన ఫోటోలను వాల్‌పేపర్లుగా పెట్టుకుంటే, జీవితంలో, కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి. సానుకూల శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.
ఉదయించే సూర్యుడు
ఉదయిస్తున్న సూర్యుడి ఫోటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నట్లయితే, కొత్త ప్రారంభాలు, శక్తి, ఆశలకు ఇది సంకేతంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు పెరిగి, పనుల్లో అడ్డంకులు తొలగుతాయి. పనులు సమయానికి పూర్తవుతాయి.
ప్రవహించే నీరు లేదా జలపాతం
ఈ వాల్‌పేపర్‌ను పెట్టుకుంటే పురోగతి, అభివృద్ధి పొందవచ్చు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై జలపాతం లేదా నది చిత్రాన్ని పెట్టినట్లయితే, ఆఫీసులో ఎదురయ్యే అడ్డంకులు తొలగి విజయాలను అందుకోవచ్చు.
ఫ్యామిలీ ఫోటో
మీ ఫ్యామిలీ ఫోటోను వాల్‌పేపర్‌గా పెట్టుకుంటే సానుకూలత పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. పనిలో మెరుగైన పనితీరు ఉంటుంది. భావోద్వేగ సమతుల్యతను కూడా ఇది పెంచుతుంది. కుటుంబ ఫోటో చూస్తే ఒక విధమైన భరోసా, ప్రేరణ లభిస్తాయి.
పాత లేదా చీకటిగా ఉండే ఫోటోలు పెట్టుకోవచ్చా?
వాస్తు ప్రకారం పాత, చీకటి లేదా విషాదకరమైన ఫోటోలు నిరాశను కలిగిస్తాయి. ఎల్లప్పుడూ వెలుగు, అభివృద్ధి, ప్రకృతిని ప్రతిబింబించే చిత్రాలనే ఎంచుకోవాలి.
మనం నిత్యం చూసే ల్యాప్‌టాప్ స్క్రీన్ కేవలం ఒక విజువల్ మాత్రమే కాదు, అది ఒక శక్తి కేంద్రం. సరైన చిత్రాన్ని ఎంచుకోవడం ద్వారా మీ కెరీర్‌లో సానుకూల మార్పులను మీరే గమనించవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


