చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండడానికి రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి? వాస్తు ప్రకారం ఇంట్లో ఎందుకు డబ్బు నిలవదు? అందుకు కారణం ఏమిటి? అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.
వాస్తుతో శుభ ఫలితాలు

నిజానికి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థికపరంగా ఏ ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో గొడవలు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం కొన్ని విషయాలు పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించాలి. ఈ రెండిటిని పాటించడం వలన ఏ సమస్య లేకుండా ఉండడానికి వీలవుతుంది. మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎందుకు ఆర్థిక సమస్యలు వస్తాయి? అందుకు కారణాలు ఇవి అవ్వచ్చు. చూసుకోండి.
ఇంట్లో ఈ పొరపాట్లు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి.. డబ్బు నిలవదు
ప్రధాన ద్వారం
ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం బాగుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. ఇంటి ప్రధాన ద్వారం అందంగా, శుభ్రంగా, చెత్తాచెదరం లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, విరిగిపోయిన సామాన్లు, పాత పేపర్లు, పనికిరాని వస్తువులు వంటివి పెట్టడం వలన ఆర్థిక సమస్యలు వస్తాయి. డబ్బు ప్రవాహం ఉండదు.
వంటగది దిశ
వంటగది ఎప్పుడూ సరైన దిశలో ఉండాలి. ఈశాన్యం వైపు వంటగది ఉంటే సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం వంటగది వాయువ్యం వైపు కూడా ఉండకూడదు. ఈ రెండు దిశల్లో వంటగది ఉండడం వలన సమస్యలు వస్తాయి. అలాగే వంటగదిలో ప్రతికూల శక్తి కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడూ వంటగదిలో ఉండే కుళాయిలు కూడా లీక్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ సమస్య వస్తే వెంటనే రిపేర్ చేయించుకోవడం మంచిది.
పడక గది:
{{/usCountry}}వంటగది ఎప్పుడూ సరైన దిశలో ఉండాలి. ఈశాన్యం వైపు వంటగది ఉంటే సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం వంటగది వాయువ్యం వైపు కూడా ఉండకూడదు. ఈ రెండు దిశల్లో వంటగది ఉండడం వలన సమస్యలు వస్తాయి. అలాగే వంటగదిలో ప్రతికూల శక్తి కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడూ వంటగదిలో ఉండే కుళాయిలు కూడా లీక్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ సమస్య వస్తే వెంటనే రిపేర్ చేయించుకోవడం మంచిది.
పడక గది:
{{/usCountry}}బెడ్‌రూమ్ ఎప్పుడూ వాస్తు ప్రకారం ఉండాలి. ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలంటే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలాగే బెడ్‌రూమ్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండకూడదు. వీటి వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది.
చెత్త
ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండాలి. చెత్తాచెదరం లేకుండా చూసుకోవాలి. పాత బట్టలు, విరిగిపోయిన ఎలక్ట్రానిక్ సామాన్లు వంటివి ఉండకూడదు. వీటి వలన ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన వాటిని తొలగించాలి. అప్పుడే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇల్లు బాగుంటుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మలు
వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. జ్ఞానం పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ముఖ ద్వారం వద్ద, ఉత్తరం వైపు, బెడ్‌రూమ్‌లో, స్టడీ రూమ్‌లో ఏనుగు బొమ్మలను పెట్టడం వలన ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి.