ప్రేమ, వైవాహిక జీవితంలో సమస్యలా? కష్టపడినా ఫలితం రావట్లేదా? శుక్రుడే కారణం అవ్వచ్చు.. ఇలా చేస్తే జీవితమే మారిపోతుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. అదే శుక్రుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే డబ్బుకు లోటు ఉండదు, విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు, కంఫర్టబుల్ జీవితం ఉంటుంది. పైగా విజయాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండక్కర్లేదు.
గ్రహాలు ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతులను, పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. అలాగే ఆర్థికపరంగా సమస్యలు ఉండకూడదని భావిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. అదే శుక్రుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే డబ్బుకు లోటు ఉండదు, విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు, కంఫర్టబుల్ జీవితం ఉంటుంది. పైగా విజయాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండక్కర్లేదు.
జాతకంలో శుక్రుడి స్థానం బలపడితే ఈ సమస్యలు ఏమి కూడా ఉండవు. ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి కచ్చితంగా జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉండేటట్టు చూసుకోవాలి. జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉందని ఎలా తెలుసుకోవచ్చు? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అలాగే పరిహారాలు గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
జాతకంలో శుక్రుడు స్థానం బలహీనంగా ఉంటే కనిపించే లక్షణాలు
వైవాహిక జీవితంలో సమస్యలు:
జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో ఆనందం ఉండదు. ఏదో ఒక అసంతృప్తి కలుగుతుంది. అలాంటి సమయంలో శుక్రుడి స్థానం బలపడడానికి ప్రయత్నం చేయాలి.
చర్మ, కంటి సమస్యలు
జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉన్నట్లయితే చర్మ సమస్యలు, కంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం మంచిది.
ఆకర్షణ తగ్గిపోవడం
ముఖంపై గ్లో తగ్గిపోవడం, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా లేకపోవడం వంటి లక్షణాలు శుక్రుడి స్థానం బలహీనంగా ఉన్నప్పుడు కనిపిస్తాయి.
విలాసవంతమైన జీవితం లేకపోవడం
శుక్రుడి స్థానం బలహీనంగా ఉన్నట్లయితే కొత్త ఇల్లు, వాహనం, కొత్త దుస్తులు వంటి వాటిని పొందడంలో అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. జీవితం సాఫీగా సాగదు.
ప్రేమ జీవితంలో సమస్యలు
శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. అలాగే సక్సెస్ కూడా అంత త్వరగా రాదు.
జాతకంలో శుక్రుడి స్థానం బలపడాలంటే పాటించాల్సిన పరిహారాలు:
- శుక్రుడు బలంగా మారాలంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉండండి. అలాగే తెల్లటి వస్త్రాలను ధరించడం మంచిది.
- “ఓం శం శుక్రాయ నమః” మంత్రాన్ని 108 సార్లు శుక్రవారం లేదా ప్రతిరోజూ జపిస్తే మంచిది.
- జ్యోతిష్య నిపుణులను సంప్రదించి సూచన మేరకు వజ్రం లేదా ఉంగరం ధరిస్తే శుక్రుడు బలపడతాడు.
- పాలు, బియ్యం, పెరుగు, తెల్లటి వస్త్రాలు వంటి వాటిని దానం చేయాలి.
- బెల్లం, బియ్యం వంటి వాటిని ఆహారంగా దానం చేస్తే కూడా జాతకంలో శుక్రుడి స్థానాన్ని బలపరచవచ్చు.
- మాటలో మృదుత్వం ఉండేటట్టు చూసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వినమ్రతతో మాట్లాడితే గౌరవం పెరుగుతుంది.
- శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసి హారతి ఇస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


