Vastu Shastra: పేదరికం, ఆర్థిక సమస్యలకు కారణాలు ఏంటి? వాస్తు ప్రకారం ఇంట్లో చేయకూడని 4 పొరపాట్లు తెలుసుకోండి!
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థికపరంగా ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటారు. కొన్ని సార్లు ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో గొడవలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం కొన్ని విషయాలు పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇంట్లో ఈ పొరపాట్లు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి.
చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండడానికి రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి? వాస్తు ప్రకారం ఇంట్లో ఎందుకు డబ్బు నిలవదు? అందుకు కారణం ఏమిటి? అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

వాస్తుతో శుభ ఫలితాలు
నిజానికి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థికపరంగా ఏ ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో గొడవలు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం కొన్ని విషయాలు పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించాలి. ఈ రెండిటిని పాటించడం వలన ఏ సమస్య లేకుండా ఉండడానికి వీలవుతుంది. మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎందుకు ఆర్థిక సమస్యలు వస్తాయి? అందుకు కారణాలు ఇవి అవ్వచ్చు. చూసుకోండి.
ఇంట్లో ఈ పొరపాట్లు చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి.. డబ్బు నిలవదు
ప్రధాన ద్వారం
ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం బాగుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. ఇంటి ప్రధాన ద్వారం అందంగా, శుభ్రంగా, చెత్తాచెదరం లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, విరిగిపోయిన సామాన్లు, పాత పేపర్లు, పనికిరాని వస్తువులు వంటివి పెట్టడం వలన ఆర్థిక సమస్యలు వస్తాయి. డబ్బు ప్రవాహం ఉండదు.
వంటగది దిశ
వంటగది ఎప్పుడూ సరైన దిశలో ఉండాలి. ఈశాన్యం వైపు వంటగది ఉంటే సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం వంటగది వాయువ్యం వైపు కూడా ఉండకూడదు. ఈ రెండు దిశల్లో వంటగది ఉండడం వలన సమస్యలు వస్తాయి. అలాగే వంటగదిలో ప్రతికూల శక్తి కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడూ వంటగదిలో ఉండే కుళాయిలు కూడా లీక్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ సమస్య వస్తే వెంటనే రిపేర్ చేయించుకోవడం మంచిది.
పడక గది:
బెడ్‌రూమ్ ఎప్పుడూ వాస్తు ప్రకారం ఉండాలి. ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలంటే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలాగే బెడ్‌రూమ్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండకూడదు. వీటి వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది.
చెత్త
ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండాలి. చెత్తాచెదరం లేకుండా చూసుకోవాలి. పాత బట్టలు, విరిగిపోయిన ఎలక్ట్రానిక్ సామాన్లు వంటివి ఉండకూడదు. వీటి వలన ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన వాటిని తొలగించాలి. అప్పుడే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇల్లు బాగుంటుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మలు
వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. జ్ఞానం పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ముఖ ద్వారం వద్ద, ఉత్తరం వైపు, బెడ్‌రూమ్‌లో, స్టడీ రూమ్‌లో ఏనుగు బొమ్మలను పెట్టడం వలన ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


