Vastu: ఈ ఏడింటిని ఇంట్లో పెడితే అదృష్టం, సంపద, పాజిటివ్ ఎనర్జీ డబుల్ అవుతాయి.. ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది!

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం ఉండాలని, సానుకూల శక్తి ప్రవహించాలని రకరకాల వస్తువులను, మొక్కలను పెడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉన్నట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా తొలగిపోతుంది. మరి వాస్తు శాస్త్రం ఏం చెప్తోంది?

Published on: Feb 2, 2026, 12:01:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం ఉండాలని, సానుకూల శక్తి ప్రవహించాలని రకరకాల వస్తువులను, మొక్కలను పెడుతూ ఉంటారు.

Vastu: ఈ ఏడింటిని ఇంట్లో పెడితే అదృష్టం, సంపద, పాజిటివ్ ఎనర్జీ డబుల్ అవుతాయి (pinterest)
Vastu: ఈ ఏడింటిని ఇంట్లో పెడితే అదృష్టం, సంపద, పాజిటివ్ ఎనర్జీ డబుల్ అవుతాయి (pinterest)

వీటిని కనుక మీ ఇంట్లో పెట్టినట్లయితే ఒక్కసారిగా మీ జీవితం తలకిందులు అయ్యే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉన్నట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా తొలగిపోతుంది. మరి వాస్తు శాస్త్రం ఏం చెప్తోంది? సానుకూల శక్తి ప్రవహించడానికి ఇంట్లో ఎలాంటి వస్తువులను పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వస్తువులను ఇంట్లో పెట్టినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది.. మీ ఇంట సంతోషం ఉంటుంది

1.నెమలీకలు:

చాలా మంది ఇళ్లల్లో నెమలీకలను పెడుతూ ఉంటారు. వీటిని ఇంట్లో ఉంచినట్లయితే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. నెమలీకలు ఉండడం వలన శాంతి కూడా కలుగుతుంది. వీటిని ఇంట్లో తూర్పు వైపు పెడితే మంచిది.

2.వాటర్ ఫౌంటెన్:

ఇంట్లో ప్రవహించే నీరు ఉన్నట్లయితే డబ్బుకు లోటు ఉండదు. డబ్బు కూడా అలాగే ప్రవహిస్తుంది. వాటర్ ఫౌంటెన్‌ను ఈశాన్యం వైపు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

3.విండ్ చైమ్స్:

వీటిని ఇంట్లో పెట్టడం వలన ప్రతికూల శక్తి తొలగి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆనందంగా ఉండొచ్చు. సానుకూల శక్తి కలిగి, ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోతాయి.

4.లక్కీ బ్యాంబూ మొక్క:

ఈ మొక్క ఇంటికి శాంతిని తీసుకొస్తుంది. ఎదుగుదలకు చిహ్నం. ఈ మొక్కను తూర్పు లేదా ఆగ్నేయం వైపు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి కూడా మాయమైపోతుంది.

5.తులసి మొక్క:

తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తాము. తులసి మొక్కను ఇంటి ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తరం వైపు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న గాలి శుద్ధి అవ్వడమే కాకుండా, ఆధ్యాత్మిక ప్రశాంతతను కూడా పొందడానికి వీలవుతుంది.

6.లాఫింగ్ బుద్ధా:

లాఫింగ్ బుద్ధాను ఇంటి ప్రధాన ద్వారం వైపు చూస్తున్నట్లుగా పెడితే సంతోషం, అదృష్టం వెతుక్కుంటూ వస్తాయి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

7.క్రిస్టల్ తాబేలు:

క్రిస్టల్ తాబేలును ఇంటి ఉత్తర దిశలో పెట్టండి. ఇక మీకు తిరుగు ఉండదు. సంపద పెరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.

అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం ఉప్పును తుడిచే నీళ్లలో వేసి ఇంటిని క్లీన్ చేసినట్లయితే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. పూజగది, ఇంటి ప్రధాన ద్వారం ముందు ముగ్గులు వేస్తే కూడా మంచి జరుగుతుంది. దుష్ట శక్తులు ప్రవహించవు. ప్రవేశ ద్వారం ఎప్పుడూ వెలుతురుతో ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం పై స్వస్తిక్ గుర్తులు వేస్తే కూడా మంచి ఫలితాన్ని చూస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More