12 సంవత్సరాల తర్వాత గురువు ప్రత్యక్ష సంచారం, 3 రాశుల వారి సంపద పెరుగుతుంది!
జ్యోతిష్య శాస్త్రంలో గురువు సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మిథున రాశిలో గురువు తిరోగమనంలో వున్నాడు. ఆ తరవాత ప్రత్యక్ష సంచారం చేస్తాడు. దీంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక రకాల మార్పులను తీసుకు వస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురవుతాయి, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రంలో గురువు హోదాను కలిగి ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గురువు సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మిథున రాశిలో గురువు తిరోగమనంలో వున్నాడు. ఆ తరవాత మార్చి నెలలో ప్రత్యక్ష సంచారం చేస్తాడు. దీంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు.
గురువు ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారిపై ప్రభావం
గురువు ప్రత్యక్ష సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. ఈ రాశుల వారు చాలా అదృష్టవంతులు.12 ఏళ్ల తర్వాత ఈ రాశిలో గురువు నేరుగా సంచారం చేస్తాడు. ఈ ప్రత్యక్ష సంచారంతో మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి.
సింహ రాశి
గురువు ప్రత్యక్ష సంచారం సింహ రాశి వారికి బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. శుభ ఫలితాలను పొందుతారు. అనేక ప్రాజెక్టులను చేపడతారు. విజయాలను అందుకుంటారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి గురువు తిరోగమనం నుంచి ప్రత్యక్ష సంచారం చేయడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు కూడా ఇదే శుభ సమయం. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. సమస్యలను మాటలతో పరిష్కరించుకుంటారు. కెరీర్‌లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎదుగుదల కనిపిస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి గురువు కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. సానుకూల మార్పులను చూస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. శుభవార్తలను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


