అదృష్టం కలిసి రావాలంటే ఈ మూడు రత్నాలను ధరిస్తే మంచిది.. డబ్బు, పురోగతితో పాటు ఎన్నో ఊహించని లాభాలు!

కొన్ని రత్నాల ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా కలిసి వస్తుంది. డబ్బు కూడా వర్షంలా కురుస్తుంది. రత్న శాస్త్రం ప్రకారం ఈ రత్నాలు చాలా శక్తివంతమైనవి.

Published on: Jan 19, 2026, 13:30:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది రకరకాల రత్నాలను ధరిస్తారు. రత్నాలను ధరించడం వలన అనేక మార్పుల్ని చూడొచ్చు. రత్న శాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలను ధరించడం వలన అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కొన్ని రత్నాలను ధరిస్తే అన్నీ సమతుల్యంగా ఉంటాయి, కష్టానికి తగ్గ ఫలితం చూడొచ్చు. అలాగే బలహీనమైన గ్రహాలను బలపరచడానికి వీలవుతుంది.

అదృష్టం కలిసి రావాలంటే ఈ మూడు రత్నాలను ధరిస్తే మంచిది (pinterest)
అదృష్టం కలిసి రావాలంటే ఈ మూడు రత్నాలను ధరిస్తే మంచిది (pinterest)

కొన్ని రత్నాల ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా కలిసి వస్తుంది. డబ్బు కూడా వర్షంలా కురుస్తుంది. రత్న శాస్త్రం ప్రకారం ఈ రత్నాలు చాలా శక్తివంతమైనవి.. వీటిని ధరించడం వలన అదృష్టం తలుపు తెరుచుకుంటుంది.

ఈ రత్నాలతో అదృష్టాన్ని పెంచుకోవచ్చు, పురోగతి ఉంటుంది

పుష్యరాగం

పుష్యరాగం ధరిస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. పుష్యరాగాన్ని ధరించడం వలన అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఇది నేరుగా గురువుతో సంబంధం కలిగి ఉంటుంది. తోపాటు లాభాలు కలుగుతాయి. ఈ రత్నాన్ని ధరిస్తే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, సంతోషం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉంటాయి.

ఈ రత్నాన్ని ధరించే కొన్ని నియమాలను పాటించాలి. ఈ రత్నాన్ని గురువారం నాడు, సూర్యోదయం సమయంలో ధరిస్తే మంచిది. బంగారంతో పాటు కూడా వేసుకోవచ్చు. “ఓం బ్రం బృహస్పతియే నమః” అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ రత్నాన్ని ధరించాలి. గంగాజలం లేదా నీటితో శుద్ధి చేయాలి. ఇది తులా రాశి, మీన రాశి వారికి బాగా కలిసి వచ్చేలా చేస్తుంది.

రూబీ

రూబీ రత్నాన్ని సూర్యుడు పాలిస్తాడు. రూబీ రత్నాన్ని ధరిస్తే పని ప్రదేశంలో మంచి పేరు తెచ్చుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. పాలిటిక్స్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ రత్నాన్ని ధరిస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. రూబీ రత్నాన్ని బంగారం లేదా రాగి ఉంగరంతో ముద్రించవచ్చు. ఆదివారం నాడు ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. పచ్చిపాలు లేదా గంగాజలంతో శుద్ధి చేసి ధరించాలి. మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశి వారికి ఇది సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది.

నీలం

నీలం రత్నాన్ని ధరిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది శని దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని ధరించడం వలన పేదవాడు కూడా రాజుగా మారిపోతాడు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఊహించని విధంగా వ్యాపారంలో కలిసి వస్తుంది. ఈ రత్నాన్ని మధ్య వేలుకు పెట్టుకుంటే మంచిది. శనివారం నాడు ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి, కుంభ రాశి వారికి ఇది బాగా కలిసి వచ్చేలా చేస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More