ఇంట్లో వాటర్ ఫౌంటెన్, అక్వేరియం ఇలా పెడితే.. కుబేరుని కటాక్షంతో ధన వర్షమే!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నీటికి సంబంధించిన వస్తువులను సరైన దిశలో ఏర్పాటు చేయడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని నమ్మకం. ముఖ్యంగా వాటర్‌ఫాల్స్, ఫౌంటెన్లు, ఫిష్ అక్వేరియంలను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.  

Published on: Aug 12, 2026, 08:00:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని, అదృష్టం కలిసి రావాలని అనుకుంటారు. అయితే వాస్తు ప్రకారం పాటించడం వలన ఇవన్నీ సాధ్యం అవుతాయి. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూల శక్తి తగ్గుతుంది.

వాస్తు ప్రకారం ఇంట్లో నీటిని ఇలా ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుందట! (pinterest)
వాస్తు ప్రకారం ఇంట్లో నీటిని ఇలా ఉంచితే ధన ప్రవాహం పెరుగుతుందట! (pinterest)

ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సురక్షితంగా ఉండడంతో పాటుగా ప్రశాంతమైన, సంతోషకరమైన ఇంటిని కోరుకుంటారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు ఇంట్లో ఒక్కోసారి నిలవదు. వాస్తు ప్రకారం వీటిని పాటించడం వలన ఈ సమస్య నుంచి బయటపడడానికి వీలవుతుంది.

వాస్తు ప్రకారం నీటికి ధన ప్రవాహంతో ప్రత్యేక సంబంధం ఉంది. నీళ్లు నిరంతరం ప్రవహించినట్లయితే, ఇంట్లో నీటిని సరైన దిశలో ఉంచినట్లయితే ఆర్థిక ప్రవాహం కూడా సజావుగా కొనసాగుతుంది. చాలా మంది ఇంటి అందాన్ని పెంచడానికి ఇండోర్ వాటర్‌ఫాల్స్, ఫౌంటెన్లు వంటివి పెడుతూ ఉంటారు. కొంతమంది ఫిష్ అక్వేరియం కూడా పెడతారు. అయితే వీటిని సరిగ్గా, సరైన దిశలో ఉంచాలి. లేకపోతే ఆర్థిక లాభాలకు బదులుగా నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఇంట్లో నీటికి సంబంధించిన వస్తువులను ఏ దిశలో పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నీటి వస్తువులకు ఏ దిశ సరైనది?

వాస్తు ప్రకారం ఇంట్లో నీటికి సంబంధించిన వస్తువులను పెట్టాలనుకుంటే ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెట్టడం మంచిది. ఈ దిశలు జలతత్వంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. సంపద అధిపతి అయినటువంటి కుబేరుడికి సంబంధించిన దిశలు ఇవి.

ఇంట్లో చిన్న వాటర్ ఫౌంటెన్లు, వాటర్‌ఫాల్స్ వంటివి ఏర్పాటు చేయాలనుకుంటే ఉత్తర దిశలో పెట్టడం మంచిది. దీని వలన వివిధ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంతో పాటు, వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. వాటర్ ఫౌంటెన్‌లోని నీటి ప్రవాహం బయటకు కాకుండా ఇంటి వైపు ప్రవహించేటట్టు పెట్టడం మంచిది.

ఫిష్ అక్వేరియం వలన కలిగే ప్రయోజనాలు

ఇంట్లో ఫిష్ అక్వేరియంను ఏర్పాటు చేయడం వలన కూడా అనేక లాభాలు ఉంటాయి. ఇది కేవలం అలంకరణ కోసమే కాదు, ప్రతికూల శక్తిని తొలగించడానికి కూడా బాగా పనిచేస్తుంది.

అక్వేరియంను ఇంటి డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో తూర్పు లేదా ఉత్తరం వైపు పెట్టడం మంచిది.

నీటిలో చేపలు చురుకుగా ఈదుతూ ఉంటే ఇంట్లో సానుకూలత, ఆనందం కూడా పెరుగుతాయి. చేపల కదలిక వలన ఏర్పడే శక్తి ఇంట్లో వాస్తు దోషాలను తగ్గిస్తుంది, ఆర్థిక సమస్యలను పోగొడుతుంది.

ఈ తప్పులు చేయొద్దు

వాస్తు ప్రకారం మురికిగా ఉన్న లేదా నిలిచిపోయిన నీరు అసలు శుభకరమైనదిగా భావించరు. కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడూ శుభ్రమైన నీరు ఉండేటట్టు చూసుకోవాలి.

ఈ ప్రదేశాల్లో మాత్రం పెట్టొద్దు

బెడ్‌రూమ్‌లో వాటర్ ఫౌంటెన్ లేదా అక్వేరియంను పెట్టడం మంచిది కాదు. బెడ్‌రూమ్‌లో నీటికి సంబంధించినవి ఇలా ఉండడం వలన భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఒత్తిడి పెరగవచ్చు. వంటగదిలో కూడా అక్వేరియం లేదా వాటర్‌ఫాల్స్‌ను పెట్టడం మంచిది కాదు. వంటగదిలో అగ్నితత్వం ఉంటుంది కాబట్టి ఈ పొరపాటు చేయొద్దు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More