ఇంట్లో గులాబీ మొక్క పెంచొచ్చా? వాస్తు ప్రకారం ఏ దిశలో నాటితే శుభ ఫలితాలు?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీ మొక్కను పెంచడం వల్ల సానుకూల శక్తి, ప్రేమ, ప్రశాంతత పెరుగుతాయని చెబుతారు. గులాబీ పూలతో పూజ చేయవచ్చా? ఏ దిశలో నాటితే శుభ ఫలితాలు కలుగుతాయి? గులాబీ మొక్క సంరక్షణలో పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
చాలామంది వాస్తు ప్రకారం జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఇంట్లో రకరకాల మొక్కలను కూడా పెంచుతూ ఉంటాము. వాటిని కూడా వాస్తు ప్రకారమే నాటడం మంచిదని చెబుతారు.

గులాబీ మొక్కలు
మన ఇంట్లో మొక్కలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. అలాగే సానుకూల శక్తికి కూడా కారణమవుతాయి. ఎక్కువ మంది ఇళ్లలో పూల మొక్కలు ఉంటాయి. ముఖ్యంగా గులాబీ పూల మొక్కలను చాలా మంది పెంచుతారు. రంగురంగుల గులాబీ పూల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే గులాబీ పూలను పూజలో కూడా ఉపయోగించవచ్చు.
అయితే గులాబీ పూల మొక్కలను ఇంట్లో పెంచేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. అలాగే చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే, గులాబీ మొక్క ఇంట్లో ఉండొచ్చా? ఉండకూడదా? దీని వల్ల శుభ ఫలితాలు కలుగుతాయా? అశుభ ఫలితాలు కలుగుతాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబీ పూలతో పూజ చేయొచ్చా?
మొదట ఈ విషయానికి వస్తే, గులాబీ పూలతో పూజ చేయవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజల్లో ఈ పూలను ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తి తగ్గుతుందని చెబుతారు. శ్రేయస్సు, ఐశ్వర్యం, అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
సానుకూల శక్తి రెట్టింపు
వాస్తు ప్రకారం చూసినట్లయితే, ఇంట్లో గులాబీ మొక్కలను పెంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఈ మొక్కలను పెంచవచ్చు. ఇవి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.
గులాబీ మొక్క ఏ దిశలో ఉంటే మంచిది?
వాస్తు ప్రకారం ఈ మొక్కను సరైన దిశలో నాటాలి. అప్పుడే సానుకూల ఫలితాలను పొందవచ్చని చెబుతారు. ఇంటి ముందు లేదా ఆవరణలో తూర్పు వైపు గులాబీ మొక్కలను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఇవి సానుకూల శక్తిని పెంచి, శుభ ఫలితాలను తీసుకొస్తాయని నమ్మకం.
ఉత్తర దిశలో నాటచ్చా?
ఒకవేళ తూర్పు వైపు నాటడం సాధ్యం కాకపోతే, ఉత్తర దిశలో కూడా గులాబీ మొక్కలను నాటవచ్చు. ఇలా చేయడం వల్ల సంపద, అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు. ఈ దిశలో ఉంచినా శుభ ఫలితాలను పొందవచ్చని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.
ఎప్పటికప్పుడు ఎండిపోయిన, వాడిపోయిన ఆకులను, పూలను తొలగిస్తూ ఉండాలి. అలాగే మొక్క చుట్టూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మురికి, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుందని చెబుతారు. అలాగే గులాబీ మొక్క ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా అవసరం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


