చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మరి వాస్తు ప్రకారం ఏం చేయాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే ఆనందం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
మొక్కలను ఇంట్లో పెట్టండి

కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తు ప్రకారం తులసి, కలబంద, పాథోస్, మనీ ప్లాంట్, అరేక పామ్ వంటి మొక్కలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే వీటిని ఇంట్లో ఉంచడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయండి
చాలా మంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్లలో ఉప్పు వేస్తారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయడం వలన వైరస్, బ్యాక్టీరియా వంటివి తొలగిపోవడమే కాకుండా సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.
నీటిని వృథా చేయకండి
వాస్తు ప్రకారం నీరు ఆరోగ్యం, ధనాన్ని సూచిస్తుంది. ఇది వృథా అవ్వడం వలన అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. పక్షులకు ఒక బౌల్లో నీళ్లు పోసి పెట్టడం వంటివి చేస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అలాగే ఇంట్లో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
కర్పూరం వెలిగించండి
ఇంట్లో కనీసం వారానికి ఒక్కసారైనా కర్పూరాన్ని వెలిగించండి. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే లెమన్ గ్రాస్, వేప కూడా ఇంటిని ప్యూరిఫై చేస్తాయి.
ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించండి
వాస్తు ప్రకారం ఇంట్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. అప్పుడు సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో పనికిరాని వస్తువులు వంటివి పెట్టడం వలన వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు కూడా వస్తాయి.
గాలి, వెల్తురు వచ్చేలా చూడండి
{{/usCountry}}వాస్తు ప్రకారం ఇంట్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. అప్పుడు సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో పనికిరాని వస్తువులు వంటివి పెట్టడం వలన వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు కూడా వస్తాయి.
గాలి, వెల్తురు వచ్చేలా చూడండి
{{/usCountry}}ఇంట్లోకి గాలి, వెల్తురు వస్తూ ఉండాలి. అవి సానుకూల శక్తిని వ్యాపించేలా చేస్తాయి. రాత్రి సంధ్య వేళ తర్వాత ఇంట్లో దీపాలు వెలిగేటట్టు చూడండి. వెల్తురు ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉంటుందని చెబుతారు. వెల్తురు లేకపోతే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
ఇలాంటివి ఇంట్లో పెట్టకండి
బాధను కలిగించేవి, యుద్ధానికి సంబంధించిన చిత్రాలు ఇంట్లో పెట్టకండి. ఫోటో ఫ్రేములు వంటివి పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకండి. అలాగే అద్దాలను ఇంట్లో పెట్టేటప్పుడు కూడా సరిగ్గా పెట్టండి. కొన్ని తప్పులు చేయడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.