వాస్తు చిట్కాలు: ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం పొందాలనుకుంటే.. ఈ 7 ఈజీ టిప్స్ ఫాలో అవ్వండి!

వాస్తు ప్రకారం ఇలా చేయడం వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మరి వాస్తు ప్రకారం ఏం చేయాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే ఆనందం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇంట్లో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.

Published on: Feb 19, 2026 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మరి వాస్తు ప్రకారం ఏం చేయాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే ఆనందం, ఆరోగ్యం రెండూ ఉంటాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది.

వాస్తు చిట్కాలు: ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం పొందాలనుకుంటే.. ఈ 7 ఈజీ టిప్స్ ఫాలో అవ్వండి (pinterest)
వాస్తు చిట్కాలు: ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం పొందాలనుకుంటే.. ఈ 7 ఈజీ టిప్స్ ఫాలో అవ్వండి (pinterest)

మొక్కలను ఇంట్లో పెట్టండి

కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తు ప్రకారం తులసి, కలబంద, పాథోస్, మనీ ప్లాంట్, అరేక పామ్ వంటి మొక్కలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే వీటిని ఇంట్లో ఉంచడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయండి

చాలా మంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్లలో ఉప్పు వేస్తారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయడం వలన వైరస్, బ్యాక్టీరియా వంటివి తొలగిపోవడమే కాకుండా సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.

నీటిని వృథా చేయకండి

వాస్తు ప్రకారం నీరు ఆరోగ్యం, ధనాన్ని సూచిస్తుంది. ఇది వృథా అవ్వడం వలన అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. పక్షులకు ఒక బౌల్లో నీళ్లు పోసి పెట్టడం వంటివి చేస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అలాగే ఇంట్లో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.

కర్పూరం వెలిగించండి

ఇంట్లో కనీసం వారానికి ఒక్కసారైనా కర్పూరాన్ని వెలిగించండి. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే లెమన్ గ్రాస్, వేప కూడా ఇంటిని ప్యూరిఫై చేస్తాయి.

ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించండి

వాస్తు ప్రకారం ఇంట్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. అప్పుడు సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో పనికిరాని వస్తువులు వంటివి పెట్టడం వలన వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు కూడా వస్తాయి.

గాలి, వెల్తురు వచ్చేలా చూడండి

ఇంట్లోకి గాలి, వెల్తురు వస్తూ ఉండాలి. అవి సానుకూల శక్తిని వ్యాపించేలా చేస్తాయి. రాత్రి సంధ్య వేళ తర్వాత ఇంట్లో దీపాలు వెలిగేటట్టు చూడండి. వెల్తురు ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉంటుందని చెబుతారు. వెల్తురు లేకపోతే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

ఇలాంటివి ఇంట్లో పెట్టకండి

బాధను కలిగించేవి, యుద్ధానికి సంబంధించిన చిత్రాలు ఇంట్లో పెట్టకండి. ఫోటో ఫ్రేములు వంటివి పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకండి. అలాగే అద్దాలను ఇంట్లో పెట్టేటప్పుడు కూడా సరిగ్గా పెట్టండి. కొన్ని తప్పులు చేయడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More