Vastu: ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? కారణం నరదృష్టి అవ్వచ్చు.. ఈ పరిహారాలతో సమస్యలన్నీ తొలగిపోతాయి!
నరదృష్టికి నల్ల రాళ్లయినా పగిలిపోతాయి అని అంటారు. అయితే కొన్ని సాంప్రదాయ వాస్తు పరిహారాలను పాటించడం వలన నరదృష్టి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంట్లో తరచూ గొడవలు నరదృష్టి వలన అవ్వచ్చు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మంచిది. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? అయితే ఇలా చేయండి.
చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు, తరచూ గొడవలు లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం మంచిది.
నరదృష్టి నుంచి బయటపడడానికి సులువైన పరిహారాలు (pinterest)
నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నరదృష్టికి నల్ల రాళ్లయినా పగిలిపోతాయి అని అంటారు. అయితే కొన్ని సాంప్రదాయ వాస్తు పరిహారాలను పాటించడం వలన నరదృష్టి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంట్లో తరచూ గొడవలు నరదృష్టి వలన అవ్వచ్చు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మంచిది. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? నరదృష్టి కారణంగా ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేయండి.
నరదృష్టి నుంచి బయటపడడానికి సులువైన పరిహారాలు:
1.శుభప్రదమైన చిహ్నాలను ఇంటి ప్రధాన ద్వారంపై వేయండి:
ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. ఇంటి ప్రధాన ద్వారం సరిగ్గా శుభ్రంగా ఉంటే ఇంట్లో సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నరదృష్టి నుంచి బయటపడడానికి ప్రధాన ద్వారం పై స్వస్తిక లేదా ఓంకారం గుర్తులను వేయండి. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది.
2.మిరపకాయలు, నిమ్మకాయలు:
నిమ్మకాయలను, మిరపకాయలను కలిపి చేసిన దండను కట్టి వాటిని ఇంటికి కట్టండి. శనివారం లేదా మంగళవారం నాడు కట్టొచ్చు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి కలగకుండా ఉంటుంది. అలాగే ఇంట్లోకి కీటకాలు కూడా రావు. వారానికి ఒకసారి దీనిని మారుస్తూ ఉండండి.
3.నెమలి ఈకలు:
ఇంట్లో లివింగ్ రూమ్‌లో నెమలి ఈకలను పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి కూడా తగలదు. సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
4.కాళ్లకు నల్ల దారం:
కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకుంటే కూడా నరదృష్టి తగలకుండా ఉంటుంది. ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండొచ్చు. సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
5.ఉప్పు, పటిక పరిహారం:
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు కూడా ప్రతికూల శక్తిని తరిమికొట్టడానికి సహాయం చేస్తాయి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం ఉప్పు లేదా పటికను వేయండి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి, నరదృష్టి ఉంటే బాధల నుంచి బయటపడొచ్చు. అనుకూల శక్తి వ్యాపించి సంతోషంగా ఉండొచ్చు.