వాస్తు చిట్కాలు: వంటగది గట్టుపై ఈ 5 వస్తువులు అస్సలు పెట్టకండి!

హిందూ సంప్రదాయంలో వంటగదిని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. వాస్తు నమ్మకాల ప్రకారం వంటగది గట్టుపై కొన్ని వస్తువులను ఉంచడం మంచిది కాదు. పగిలిన లేదా విరిగిన పాత్రలు, మందులు, గిన్నెలు తోమే పీచులు, బ్రష్‌లు, పొయ్యికి ఎదురుగా అద్దం, ఖాళీ ధాన్యపు డబ్బాలను వంటగదిలో అస్తవ్యస్తంగా ఉంచకూడదని చెబుతారు. 

Published on: Oct 23, 2026, 14:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చాలామంది వారి ఇళ్లల్లో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని, సానుకూల శక్తి వ్యాపిస్తుందని నమ్మకం. అయితే, వాస్తు ప్రకారం వంటగదిలో కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు ప్రకారం వంటగది గట్టుపై కొన్ని వస్తువులు పెట్టడం మంచిది కాదు. ఈ వాస్తు నియమాలను పాటిస్తే సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

వాస్తు చిట్కాలు: వంటగది గట్టుపై ఈ 5 వస్తువులు అస్సలు పెట్టకండి! (AI)
వాస్తు చిట్కాలు: వంటగది గట్టుపై ఈ 5 వస్తువులు అస్సలు పెట్టకండి! (AI)

వాస్తు ప్రకారం వంటగది గట్టుపై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టొద్దు. వంటగదిలో ఉండే గట్టుపై ఎలాంటి వస్తువులను పెట్టకూడదు? ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే కొన్ని వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా వంటగదిలో కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం అవసరం. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది.

హిందూ సంప్రదాయంలో వంటగదిని పవిత్రమైన స్థానంగా భావిస్తారు. అన్నపూర్ణాదేవి వంటగదిలో కొలువై ఉంటుందని నమ్ముతారు. అయితే, చాలామంది టైం లేకో, లేకపోతే ఇల్లు చిన్నగా ఉండడం వలన వంటగది గట్టుపై కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి, ఎలాంటి వస్తువులను వంటగది గట్టుపై పెట్టడం వలన ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పగిలిన లేదా విరిగిన పాత్రలు:

వాస్తు ప్రకారం ఇంట్లో ఇలాంటి పాత్రలు ఉండకూడదు. వంటగదిలో లేదా వంటగది గట్టుపై ఇలాంటి పాత్రలను పెట్టొద్దు. ఇంట్లో కూడా వీటిని ఉంచకండి. దరిద్రం వస్తుంది. పనికిరాని వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. కుటుంబ ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతింటుంది.

మందులను ఉంచకండి:

వంటగదిలో లేదా వంటగది గట్టుపై మందులు ఉంచడం మంచిది కాదు. దీని వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం వంటగదిలో మందులు ఉంటే నిరంతరం అనారోగ్యాలు, ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి.

శుభ్రపరిచే సామాగ్రి:

గిన్నెలు తోమే పీచులు, బ్రష్‌లు, పనికిరాని క్లాత్‌లు ఇలాంటి వాటిని వంటగది గట్టుపై వదిలేయకూడదు. ఇది పరిశుభ్రతను దెబ్బతీస్తుంది. పైగా, వాస్తు దోషానికి కూడా దారితీస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కూడా కలగకుండా అడ్డుపడుతుంది.

పొయ్యికి ఎదురుగా అద్దం:

వంటగదిలో పొయ్యికి ఎదురుగా అద్దం ఉండడం మంచిది కాదు. ఇది కూడా సమస్యలను కలిగిస్తుంది. వంటగదిలో అగ్నిదేవుడు ఉంటాడు. గ్యాస్ స్టవ్ ఎదురుగా అద్దం ఉంటే, అగ్ని ప్రతిబింబం అందులో పడడం వలన అసమతుల్యత ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు పెరగడం వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది.

ఖాళీ డబ్బాలు:

పప్పులు, బియ్యం మొదలైన సామాగ్రి ఉండే ఖాళీ డబ్బాలను వంటగది గట్టుపై అలా వదిలేయకూడదు. ధాన్యం సంపదకు ప్రతీక. ఖాళీ డబ్బాలను అలా ఉంచితే కొరత ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు ఖాళీ డబ్బాలను తిరిగి పప్పులు, బియ్యంతో నింపండి. డబ్బాలు నిండుగా ఉంటే సంపద కూడా ఇంట్లో నిండుగా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More