శమీ వృక్షం ఇంట్లో ఉంటే శుభమా? ఏ దిశలో నాటాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి?

హిందూ సంప్రదాయంలో శమీ వృక్షానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను శనిదేవుడు, పరమశివుడితో అనుసంధానిస్తారు. వాస్తు విశ్వాసాల ప్రకారం, ఇంట్లో శమీ మొక్కను సరైన దిశలో నాటడం వల్ల సానుకూల శక్తి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. 

Published on: Oct 22, 2026, 12:32:21 IST
By , Hyderabd
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తికి దూరంగా ఉండవచ్చని భావిస్తారు.

శమీ వృక్షం ఇంట్లో ఉంటే శుభమా? ఏ దిశలో నాటాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి? (AI)
శమీ వృక్షం ఇంట్లో ఉంటే శుభమా? ఏ దిశలో నాటాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి? (AI)

చాలామంది మొక్కల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని మొక్కలు ఉండడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే, కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతికూల శక్తి వల్ల ఇబ్బందులు కలుగుతాయని నమ్ముతారు.

హిందూ ధర్మంలో శమీ వృక్షానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వృక్షానికి శనిదేవుడు, శివుడితో సంబంధం ఉందని అంటారు. వాస్తు ప్రకారం శమీ వృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, శమీ వృక్షం ఇంట్లో ఉండేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. మొక్క నాటేటప్పుడు సరైన దిశతో పాటు ముఖ్యమైన విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి.

ఇంట్లో శమీ మొక్కను ఏ దిశలో నాటితే మంచిది?

ఇంట్లో శమీ మొక్క ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. ఈ మొక్కను బాల్కనీలో లేదా టెర్రస్ పైన కూడా నాటవచ్చు. అయితే, ఏ దిశలో నాటుతున్నారనేది ముఖ్యం.

తూర్పు దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఇది ఉత్తమ దిశ. ఈ దిశలో శమీ చెట్టును నాటడం శుభ ఫలితాలను తీసుకువస్తుందని, సానుకూల శక్తి కూడా రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అయితే, తగినంత సూర్యరశ్మి ఉండేలా మాత్రం చూసుకోవాలి.

దక్షిణ దిశ: ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పై ఈ మొక్కను నాటేటప్పుడు దక్షిణ దిశ అనుకూలంగా ఉంటుంది.

ఈశాన్య దిశ: ఈశాన్య దిశలో కూడా శమీ మొక్కను నాటవచ్చు. వాస్తు ప్రకారం, ఈ దిశలో ఈ మొక్క ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. తగినంత గాలి, సూర్యరశ్మి తగిలేలా మాత్రం చూసుకోవాలి.

మేడ మీద, బాల్కనీలో లేదా ప్రధాన ద్వారం సమీపంలో మొక్కను నాటవచ్చు. మొక్కకు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. చెట్టు చుట్టూ పరిశుభ్రతను పాటించండి.

శనివారం దీపారాధన చేయండి

శమీ మొక్క దగ్గర శనివారం నాడు దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే మంచిదని భావిస్తారు. శనిదేవుని అనుగ్రహం కలిగి, శని దోషాల నుంచి బయటపడడానికి వీలవుతుందని నమ్ముతారు.

శమీ ఆకులను సమర్పించండి

శివుడికి శమీ ఆకులను సమర్పిస్తే ఉత్తమ ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. అలాగే, కుటుంబ బంధాలు దృఢంగా మారతాయని విశ్వసిస్తారు. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగడానికి కూడా వీలవుతుందని భావిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More