వంటగదిలో ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే సిరిసంపదలు పెరుగుతాయా?
వాస్తుశాస్త్రం ప్రకారం వంటగది అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో పాటు సిరిసంపదలకు కూడా ప్రతీకగా భావిస్తారు. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడంతో పాటు కొన్ని వాస్తు నియమాలను పాటించాలని చెబుతారు.
చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. సానుకూల శక్తి కూడా వాస్తు నియమాలను అనుసరించడం వలన కలుగుతుంది. చాలామంది వంటగదిలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ తప్పులు చేస్తున్నారో లేదో ఒకసారి చూసుకోండి. వంటగదిలో ఈ వాస్తు నియమాలను కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి.

వీటిని కనుక పాటించకపోతే సుఖసంతోషాలు, ఐశ్వర్యం తగ్గుతాయి. వంటగదిలో అత్యంత ముఖ్యమైన కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగది అన్నపూర్ణాదేవితో పాటుగా సిరి సంపదలకు కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వంటగదికి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ పొయ్యితో ప్రారంభించాలి: ఉదయం వంటగదిలోకి వెళ్లాక ముందుగా గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి, వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత నమస్కరించాలి. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది.
వేడి పెనంపై నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో పోయొద్దు: చాలామంది వేడి పెనంపై పొరపాటున నీళ్లు పోస్తారు. లేదంటే కావాలని చల్లబడడానికి నీళ్లు జల్లుతారు. అలా చేయకూడదు. ఇంట్లో శాంతి, సంతోషాలకు ఇది అశుభకరం. అందువలన పెనం సాధారణ ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాతే నీళ్లు పోయాలి లేదా కడగాలి.
కత్తులు, కత్తెరలు: చాలామంది వంటగదిలో గోడలకు కత్తులు, కత్తెరలను తగిలిస్తూ ఉంటారు. అది పొరపాటు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అలా కనిపించేలా ఉంచకూడదు. సురక్షితమైన, క్రమబద్ధమైన ప్రదేశంలో భద్రపరచాలి.
ఉప్పు విషయంలో ఈ తప్పులు చేయొద్దు: వంటగదిలో ఉప్పును సరిగ్గా నిల్వ చేయాలి. గాజు సీసాలో నిల్వ చేయడం శుభప్రదం. ఉప్పును సక్రమంగా నిర్వహిస్తే ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. ప్రతికూల శక్తి చేరదు.
చెత్తబుట్ట: సింక్ లేదా నేరుగా గ్యాస్ పొయ్యి సమీపంలో చెత్తబుట్టను ఉంచకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలో చెత్తను పారేయడానికి ప్రత్యేకమైన, శుభ్రమైన ప్రదేశం ఉంటే మంచిది.
ధాన్యం డబ్బాలు: బియ్యం, పిండి, ఉప్పు, నిత్యావసర వస్తువులను ఎప్పుడూ ఖాళీ చేయకూడదు. అవి కొంచెం మిగిలి ఉండగానే వాటిని తెచ్చుకుని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం కొనసాగుతుంది. కానీ పొరపాటున కూడా వాటిని పూర్తిగా ఖాళీ చేసేయొద్దు.
వంట చేసే దిశ: వాస్తు ప్రకారం వంట చేసేటప్పుడు తూర్పు దిశలో వంట చేయడం మంచిది. ఇది చాలా శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. సానుకూల శక్తితో కూడా ముడిపడి ఉంటుంది.
నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రం చేయండి: ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రం చేయండి. వంటగది శుభ్రంగా లేకపోతే సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరగవని గుర్తుపెట్టుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


