నేడు పరివర్తిని ఏకాదశి వేళ తులసితో ఈ పూజలు చేస్తే.. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి!

సెప్టెంబర్ 22, 2026 మంగళవారం జరుపుకునే పరివర్తిని ఏకాదశిని పద్మా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును వామన రూపంలో పూజించడంతో పాటు, లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసిని ఆరాధించడం మంచిది.

Published on: Sep 22, 2026, 08:00:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 22, 2026 మంగళవారం అనగా eeరోజున భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే పరివర్తిని ఏకాదశికి పద్మా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువుని వామన రూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. విష్ణు పూజలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసమ్మను ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఆరాధించడం ద్వారా ఇంటా బయటా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పరివర్తిని ఏకాదశి నాడు తులసితో ఏయే పూజా విధులను ఆచరించవచ్చో పరిశీలిద్దాం.

నేడు పరివర్తిని ఏకాదశి వేళ తులసితో ఈ పూజలు చేస్తే.. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి!
నేడు పరివర్తిని ఏకాదశి వేళ తులసితో ఈ పూజలు చేస్తే.. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి!

విష్ణువుకి తులసి దళాల సమర్పణ

పరివర్తిని ఏకాదశి రోజు ఉదయమే తలస్నానం ఆచరించి విష్ణుమూర్తిని నిష్టతో పూజించాలి. ఆ తర్వాత భగవానునికి ప్రీతిపాత్రమైన తులసి దళాలను సమర్పించడం సాంప్రదాయం. తులసి ఆకులు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఎలాంటి లోపాలు లేనివిగా ఉండేలా చూసుకోవాలి. పూజా సమయంలో తులసిని సమర్పిస్తూ విష్ణు నామాలను స్మరిస్తే విశేష ఫలితం దక్కుతుంది.

తులసి కోట ముందు దీపారాధన

ఏకాదశి సాయంత్రం వేళ తులసి మొక్క ముందు దీపం వెలిగించడం ఆచారంగా వస్తోంది. సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి చెంత నెయ్యి లేదా నూనెతో దీపం ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీహరిని స్మరిస్తూ సుఖశాంతుల కోసం ప్రార్థించాలి. దీపం ఉంచేటప్పుడు చుట్టూ ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తులసి సమీపంలో మంత్ర జపం

ఈ పర్వదినాన తులసి మొక్క వద్ద కూర్చుని కొద్దిసేపు భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనసుకు అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మహా మంత్రాన్ని మనసారా జపించాలి.

భక్తి భావంతో చేసే ఈ మంత్రోచ్ఛారణ ఇళ్లలో దైవిక శక్తిని నింపుతుంది.

దీని కోసం ఎలాంటి కఠినమైన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు, కేవలం స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు.

జల సమర్పణ మరియు సంప్రదాయ నియమాలు

తులసి మొక్కను నిత్యం సంరక్షించడం మన సంప్రదాయంలో భాగమే. ఏకాదశి రోజు తులసికి తగిన మోతాదులో నీటిని సమర్పించాలి. అయితే కొన్ని కుటుంబాల్లో ఏకాదశి రోజు తులసి ఆకులు కోయకూడదనే నియమం ఉంది. కాబట్టి ముందుగానే సిద్ధం చేసుకున్న ఆకులను పూజకు ఉపయోగించుకోవడం మంచిది. ఎవరి కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలకు తగినట్లుగా వారు ఈ పూజా కార్యక్రమాలను నిర్వర్తించుకోవచ్చు.

సేవాభావం మరియు దానధర్మాలు

పూజలతో పాటు తోటివారికి సహాయం చేయడం ఈ పవిత్ర దినాన మరింత శ్రేయస్కరం. ఎవరి శక్తికొద్దీ వారు అన్నదానం, ఫలదానం లేదా నిరుపేదలకు అవసరమైన వస్తువులను దానం చేయవచ్చు. దేవుని పూజతో పాటు తోటి మనుషుల పట్ల సేవ గుణం కలిగి ఉండటమే ఈ పండుగ అసలు పరమార్థం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More