వినాయకుడికి తులసి ఎందుకు నిషేధం? తులసీ దేవి–గణేశుడి శాప వృత్తాంతం ఇదే
గణేశ ఆరాధనలో తులసి దళాలను ఎందుకు నిషేధించబడింది? మాతా తులసి మరియు విఘ్నహర్త గణేశ యొక్క పౌరాణిక కథ, శాపం యొక్క సందర్భం మరియు దుర్వాను సమర్పించడం యొక్క మతపరమైన ప్రాముఖ్యతను తెలుసుకోండి.
గణేశుడి పూజలో తులసి ఆకులను ఎందుకు ఉపయోగించకూడదో చాలా మందికి సందేహం ఉంటుంది. దీని వెనక ఉన్న పౌరాణిక నేపథ్యం, తులసి-గణేశుల మధ్య జరిగిన శ్రాప వృత్తాంతం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గణేశ చతుర్థి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతాయి. భాద్రపద శుక్ల చతుర్థి రోజున ప్రారంభమయ్యే ఈ పర్వదినాన భక్తులు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. లంబోదరుడికి ప్రీతికరమైన ఉండ్రాలు, మోదకాలు, గరిక, ఎర్రటి పూలతో పూజలు నిర్వహిస్తారు. అయితే భగవంతుడి పూజాద్రవ్యాలలో ఎంతో పవిత్రమైన తులసిని మాత్రం వినాయకుడికి ఎప్పుడూ సమర్పించరు. దీనికి గల బలమైన పౌరాణిక కారణం ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం.
గంగానది తీరాన వినాయకుడి తపస్సు
పురాణ కథనాల ప్రకారం, ఒకానొక సమయంలో వినాయకుడు గంగానది తీర ప్రాంతంలో తీవ్రమైన తపస్సులో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ధర్మాత్మజ కుమార్తె అయిన తులసీ దేవి వివాహ ఆకాంక్షతో వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ యాత్రకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ ఆమె గంగా తీరానికి చేరుకున్నారు. అక్కడ దివ్యమైన రత్న సింహాసనంపై ఆసీనులై, దివ్య చందనాన్ని ధరించి తపస్సు చేస్తున్న గణేశుడిని ఆమె దర్శించుకున్నారు. ఆ తేజోవంతమైన రూపాన్ని చూడగానే తులసి ఆయన పట్ల ఆకర్షితులయ్యారు.
వివాహ ప్రస్తావన మరియు తిరస్కరణ
గణేశుడి దివ్యరూపానికి మోహన చెందిన తులసి, ఆయనను వివాహం చేసుకోవాలనే కోరికను పెంచుకున్నారు. తన మనసులోని మాటను చెప్పి ఆయన తపస్సును భగ్నం చేశారు. ధ్యానం నుండి వెలుపలికి వచ్చిన గణనాథుడు తులసితో మాట్లాడారు. తపస్సును భగ్నం చేయడం తగదని వారించారు. తాను బ్రహ్మచారినని స్పష్టం చేస్తూ, ఆమె వివాహ ప్రతిస్రావన్ని సున్నితంగా తిరస్కరించారు.
తులసి శాపం - ప్రతి శాపం
తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో తులసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆవేశంతో ఆమె వినాయకుడికి భవిష్యత్తులో రెండు వివాహాలు జరుగుతాయని శాపమిచ్చారు. ఆమె ప్రవర్తనకు ఆగ్రహించిన గణేశుడు కూడా ప్రతిగా స్పందించారు. తులసి ఒక అసురుడిని వివాహం చేసుకుని రాక్షస పత్నిగా మారుతుందని ఆయన శపించారు. ఆ క్షణంలో తన తప్పును తెలుసుకున్న తులసి క్షమాపణలు వేడుకున్నారు.
శంఖచూడుడితో వివాహం మరియు తులసి ప్రాధాన్యత
తులసి పశ్చాతాపాన్ని చూసి చలించిన వినాయకుడు ఆమెకు భవిష్యత్తు గురించి భరోసానిచ్చారు. ఆమె శంఖచూడుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుందని, ఆ తర్వాత విష్ణు, మరియు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన పవిత్ర మొక్కగా మారుతుందని తెలిపారు. కలియుగంలో తులసికి విశేషమైన ప్రాముఖ్యత లభిస్తుందని, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే దివ్య వృక్షంగా ఆమె పూజలందుకుంటుందని అనుగ్రహించారు.
గణేశ పూజలో తులసి ఎందుకు నిషేధం?
అలా జరిగిన ఈ పౌరాణిక సంఘటన కారణంగానే వినాయకుడి పూజలో తులసిని ఉపయోగించకూడదని నిర్ణయించారు. భగవంతుడు శ్రీహరికి తులసి ఎంతటి ఇష్టమైనదైనా, గణేశుడి పూజా విధానంలో మాత్రం తులసి దళాలకు స్థానం లేదు. అందుకే గణేశ చతుర్థి లేదా సాధారణ రోజుల్లోనూ వినాయకుడికి తులసికి బదులు తాజా గరికను సమర్పిస్తారు. గరిక సమర్పణ ద్వారానే వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


